పుతిన్ కు 2,000 సంవత్సరాల కిందట రచించిన అరుదైన పుస్తకాన్ని గిఫ్ట్ గా ఇచ్చిన ప్రధాని మోదీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. భారత పర్యటన ఆరంభమైంది. ఈ తెల్లవారు జామున ఆయన ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగా ఢిల్లీ వేదికగా జరుగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ఇది 18వ బ్రిక్స్ సమ్మిట్. ఈ సారి భారత్ దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశాలకు హాజరవుతారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.

ఈ సమ్మిట్ సైడ్ లైన్స్ లో భాగంగా భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశానికి హాజరయ్యారు.. పుతిన్. కొద్దిసేపటి కిందటే ఈ భేటీ ప్రారంభమైంది. ఈ చర్చల ప్రారంభానిక ముందు భారత్- రష్యా మధ్య సాంస్కృతిక బంధం వెలుగులోకి వచ్చింది. పుతిన్ కు ప్రధాని మోదీ.. ప్రఖ్యాత తమిళ గ్రంథం తిరుక్కురళ్‌ ను ప్రత్యేకంగా బహుమతిగా అందజేశారు. రష్యన్ భాషలోకి అనువదించిన పుస్తకం ఇది.

PM Modi gifts 2000 Years ancient Book to Vladimir Putin during the Bilateral Meeting in New Delhi

తమిళనాడుకు చెందిన మహాకవి తిరువళ్ళువర్ సుమారు 2,000 సంవత్సరాల క్రితం రచించిన విశిష్ట గ్రంథం ఇది. తమిళ ప్రజలకు ఈ రోజుకూ ఇది స్ఫూర్తిదాయకమే.. ఆదర్శనీయమే. మానవ జీవితంలోని ప్రతి దశను అద్భుతంగా ఆవిష్కరించారిందులో. నైరా మ్రక్తచ్యాన్ దీన్ని రష్యా భాషలోకి అనువదించారు. ఈ బుక్ ను పుతిన్‌కు అందజేసిన అనంతరం దీని ప్రత్యేకత గురించి వివరించారు ప్రధాని మోదీ.

ఎల్ నినో.. మరింత భీకరం: అంచనాలకు మించిన స్థాయిలో.. !!
ఎల్ నినో.. మరింత భీకరం: అంచనాలకు మించిన స్థాయిలో.. !!

ధర్మం, సంపద, ప్రేమ వంటి లౌకిక అంశాలు పునాదిగా సాగే ఈ అమూల్యమైన సాహిత్యం భారత సరిహద్దులు దాటి రష్యా ప్రజలకు మరింత చేరువ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యన్లకు భారతీయ జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతగానో తోడ్పడుతుందని, తద్వారా ఇరు దేశాల ప్రజల పరస్పర సంబంధాలు మరింత మెరుగుపడతాయనీ మోదీ పేర్కొన్నారు. తన చేతికి అందిన తర్వాత.. ఇందులోని పేజీలను పుతిన్ ఆసక్తికరంగా తిప్పడం, ఇందులో ఉన్న వివరాల గురించి మోదీని అడగటం కనిపించింది.

ఏపీకి చెందిన ఏటికొప్పాక బొమ్మల కొలువు- ఏరికోరి ఎంపిక చేసిన ప్రధాని మోదీ
ఏపీకి చెందిన ఏటికొప్పాక బొమ్మల కొలువు- ఏరికోరి ఎంపిక చేసిన ప్రధాని మోదీ

సాంస్కృతిక బంధాలతో పాటు ఈ ద్వైపాక్షిక భేటీలో కీలకమైన ఆర్థిక, పారిశ్రామికాంశాలపై ఇరు దేశాధినేతలు దృష్టి సారించారు. ముఖ్యంగా 2030 నాటికి ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యాన్ని సాధించడానికి రూపొందించాల్సిన బ్లూప్రింట్ ను ఇందులో అజెండాగా చేర్చారు. ప్రస్తుతం దీని విలువ దాదాపు 60 బిలియన్ డాలర్లు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+