శ్లీలంక అధ్యక్ష ఎన్నికలు ప్రారంభం-రేసులో విక్రమసింఘేతో పాటు వీరే- కట్టుదిట్టమైన భద్రత
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా భారీ నిరసనల మధ్య ఇవాళ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే అధ్యక్షుడు గోటబాట రాజపక్స దేశం విడిచి పారిపోయి, అనంతరం రాజీనామా సమర్పించడం, ఆ తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని విక్రమసింఘే ప్రమాణం చేయడం చకచకా జరిగిపోయాయి. అయితే రెగ్యులర్ అధ్యక్షుడు లేకుండా పాలన కష్టం కావడంతో కొత్త ప్రధాని ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
శ్రీలంక 9వ అధ్యక్షుడి పదవికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, ఎంపీలు డల్లాస్ అలహప్పెరుమ, అనురా కుమార దిసనాయకే రేసులో ఉన్నారు. అంతకుముందు ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇవాళ జరుగుతున్న ఎన్నికలకు పార్లమెంటులో అందరు ఎంపిలు హాజరవుతున్నారు. వీరు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు.

ఎన్నికల సందర్భంగా ఇవాళ సభలోకి ఏ ఎంపీ కూడా మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని స్పీకర్ ఆదేశాలు ఇచ్చారు. నిన్న కొంతమంది పార్టీ నాయకులు రహస్య పోల్‌లో క్రాస్ ఓటింగ్‌ను తనిఖీ చేయడానికి వారి బ్యాలెట్ పేపర్‌ల చిత్రాలను తీసుకోవాలని తమ ఎంపీలను కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో స్పీకర్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే పార్లమెంటు లోపల, బయట కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. దీంతో పాటు దేశంలోని ప్రధాన ప్రాంతాలు పోలీసు నీడలోనే ఉన్నాయి. చాలా తర్జనభర్జనల తర్వాత ఈరోజు జరిగే ఎన్నికల్లో తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేకు మద్దతు ఇవ్వాలని సిలోన్ వర్కర్స్ కాంగ్రెస్ నిర్ణయించిందని ఎంపి జీవన్ తొండమాన్ తెలిపారు.
కొత్త అధ్యక్షుడి ఎన్నిక సజావుగా పూర్తయితే దేశంలో పాలనను తిరిగి గాడినపెట్టే అవకాశం ఉంది. అప్పుడు భవిష్యత్తులో తలెత్తే పరిణామాలతో పాటు ఆర్ధిక విధానాలను కూడా నిర్ణయించేందుకు వీలు పడుతుందని భావిస్తున్నారు. అలాగే విదేశాల నుంచి సాయం కూడా లభించే అవకాశం ఉంటుంది












Click it and Unblock the Notifications