ఇలా చేయడం యుద్దాన్ని ఆహ్వానిస్తున్నట్టే: భారత్ పై పాక్ సంచలనం

ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అలాగే ఆ దేశంపై కఠినమైన ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. అయితే ఇదే విషయంపై తాజాగా పాకిస్థాన్ డిప్యూటీ ప్రధాని ఇషాక్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సింధూ జలాల ఒప్పందాన్ని (IWT) భారత్ బలహీనపరుస్తోందని అన్నారు.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రభావం పాకిస్తాన్ పై తీవ్రంగా పడింది. నీటి కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ డిప్యూటీ ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ భారత్‌ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ముసలి కన్నీరు కార్చారు. భారత్ ఉద్దేశపూర్వకంగానే సింధూ జలాల ఒప్పందాన్ని బలహీనపరుస్తోందని అన్నారు. తమ దేశ ప్రజలు దాహంతో చనిపోయే ప్రమాదం ఉందన్నారు. సింధూ నది జలాల ఒప్పందం మూలాలను భారత్ చర్యలు దెబ్బతీస్తున్నాయని అన్నారు.

ఈ మేరకు చీనాబ్ నది ప్రవాహంలో మార్పులపై పాకిస్థాన్ వివరణ కోరిన మరుసటి రోజు దార్ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది ఏప్రిల్‌ లో భారత్.. సింధూ జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేయడం చూశామని వివరించారు. "ఈ ఏడాది ఏప్రిల్‌ లో భారత్ ఏకపక్షంగా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం చూశాం.. కానీ, ఇప్పుడు మనం చూస్తున్నది భారత్ చేస్తున్న ఉల్లంఘనలు. ఇవి ఒప్పంద మూలాలను దెబ్బతీస్తూ, ప్రాంతీయ స్థిరత్వానికి, అంతర్జాతీయ చట్టాల పవిత్రతకు తీవ్ర విఘాతాన్ని కలిగిస్తున్నాయి" అని దార్ అన్నారు.

భారత్ నీటిని మ్యానిపులేట్ చేయడంపై పాకిస్థాన్ సింధూ కమిషనర్.. భారత్ లోని సింధూ కమిషనర్ కు లేఖ రాశారని దార్ వెల్లడించారు. సింధూ జలాల నిలిపివేతతో పాకిస్థాన్ లోని వ్యవసాయ రంగం దెబ్బతింటోందని.. దేశంలోని జీవనోపాధికి ముప్పుగా పరిణమిస్తుందని ఆయన ఆరోపించారు. సింధూ నది జలాలకు సంబంధించిన డేటాను కూడా భారత్ నిలిపివేసిందని దార్ మండిపడ్డారు. నీటిని నిలిపివేయడం కూడా యుద్ధాన్ని ప్రేరేపించినట్టేనని తెలిపారు.

Water as Weapon Ishaq Dar Warns India s IWT Suspension Could Be Act of War

ఇక సింధూ జలాల ఒప్పందం 1960లో భారత్- పాకిస్తాన్ మధ్య జరిగింది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో ఈ చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా సింధు నది వ్యవస్థలోని ఆరు ఉప నదుల నీటిని ఇరు దేశాలు ఉపయోగించుకుంటాయి. తూర్పు నదులైన బియాస్, రావి, సట్లెజ్ భారత్ కు అలాగే పశ్చిమ నదులైన సింధు, చీనాబ్, జీలం పాకిస్థాన్ కు కేటాయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+