వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రుడి మీద ఉమ్మడిగా అంతరిక్ష కేంద్రం నిర్మిస్తాం: చైనా, రష్యాల ప్రకటన - Newsreel

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
చంద్రుడు

చంద్రుడి ఉపరితలంపై లేదా కక్ష్యలో, వీలైతే రెండింట్లోనూ పరిశోధనకు అనువైన కేంద్రాన్ని నెలకొల్పేందుకు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ తెలిపింది.

ఈ కేంద్రం ఇతర దేశాలకు కూడా అందుబాటులో ఉంటుందని ఇరు దేశాల అంతరిక్ష సంస్థలూ ప్రకటించాయి.

అంతరిక్షంలోకి మానవుడు అడుగుపెట్టి 60 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంలో రష్యా ఈ ప్రకటన విడుదల చేసింది.

1961 ఏప్రిల్ 12న రష్యా కాస్మోనాట్ యూరి గగారిన్ తొలిసారిగా అంతరిక్షానికి ప్రయాణించారు.

కొత్తగా నిర్మించబోయే ఇంటర్నేషనల్ సైంటిఫిక్ లూనార్ స్టేషన్‌లో చంద్రుడిపై అన్వేషణతో సహా వివిధ రకల శాస్త్రీయ పరిశోధనలు జరిపే అవకాశం ఉంటుందని ఇరు దేశాల అంతరిక్ష సంస్థలూ తెలిపాయి.

"చైనా, రష్యా కూడా స్పేస్ సైన్స్‌లో తమ అనుభవం, పరిశోధన, అభివృద్ధి, స్పేస్ టెక్నాలజీ, పరికరాల సహాయంతో సంయుక్తంగా చంద్రమండలంపై అంతరిక్ష పరిశోధనా కేంద్ర నిర్మాణానికి రోడ్ మ్యాప్ తయారుచేస్తాయి" అని ఆ ప్రకటనలో తెలిపారు.

పరిశోధనా కేంద్రం ప్రణాళిక, రూపకల్పన, అభివృద్ధి, కార్యాచరణలను తయారుచేయడంలో ఇరు దేశాలూ కలిసి పని చేస్తాయని తెలిపారు.

చైనా స్పేస్ ప్రోగ్రాం నిపుణులు చెన్ లాన్ ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ "ఇది ప్రతిష్ఠాత్మకమైన ప్రోజెక్ట్" అని అన్నారు.

"చైనాకు ఇది అతి పెద్ద అంతర్జాతీయ అంతరిక్ష సహకార ప్రోజెక్ట్. కాబట్టి ఇది చాలా ప్రముఖ్యతను సంతరించుకుంటుంది" అని ఆయన అన్నారు.

అంతరిక్ష పరిశోధనలో చైనా కొంత ఆలస్యంగా అడుగు పెట్టినప్పటికీ గత డిసెంబర్‌లో చాంగ్'ఎ-5 ప్రోబ్‌ను చంద్రుడి పైకి పంపి అక్కడి రాళ్లను, మట్టిని సేకరించడంలో సఫలమైంది. స్పేస్‌లో చైనా సామర్థ్యానికి ఇది ప్రతీకగా నిలిచింది.

అంతరిక్ష అన్వేషణలో తొలి అడుగు వేసి ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిన రష్యాను ఇటీవల కాలంలో అమెరికా, చైనాలు అధిగమిస్తున్నాయి.

గత ఏడాది అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ విజయవంతంగా ప్రారంభమవ్వడంతో అంతరిక్షంలోకి ఆస్ట్రోనాట్‌లను పంపే విషయంలో రష్యా తన గుత్తాధిపత్యాన్ని కోల్పోయింది.

2024 కల్లా చంద్రునిపై అడుగు పెట్టేందుకు తాము సిద్ధమని ఇప్పటికే అమెరికా ప్రకటించింది. ఆర్టెమిస్ ప్రోగ్రాం ద్వారా ఒక స్త్రీ, ఒక పురుషుడు చంద్రమండలంపై అడుగుపెడతారని ప్రకటించింది. 1972 తరువాత ఇదే చంద్రునిపై మానవులు మళ్లీ అడుగుపెట్టడం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
We will build a joint space station on the moon: China, Russia statement
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X