ఒమిక్రాన్‌ను తేలిగ్గా తీసుకోవద్దు.. వచ్చే మూడు వారాల్లో మరింత ఉద్ధృతి.. డబ్యూహెచ్‌వో హెచ్చరిక
ప్రపంచాన్ని ఒకవైపు కరోనా, మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గడగడలాడిస్తోంది. రోజు రోజుకు వైరస్ తన వ్యాప్తిని విస్తరింపచేస్తోంది. ఈ మహమ్మారి దాటికి జనాలు కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. రోజు రోజుకు లక్షలాది మంది కరోనా భారిన పడుతున్నారు. తాజాగా, ఒమిక్రాన్‌ను తక్కువగా అంచనా వేయోద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. గత వేరియంట్లు ఊపిరిత్తుల పనితీరుపై ప్రభావం చూపితే.. ఒమిక్రాన్ శరీర ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించింది.

ఆరోగ్యవ్యవస్థపై ఒమిక్రాన్ ప్రభావం
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళనకరంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది . సాధారణ లక్షణాలే కన్పిస్తున్నాయని కదా అని నిర్లక్ష్యం వహించవద్దని చెప్పింది. ఇది సాధారణ జలుబు లాంటిది కాదని, మనిషి ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందని పేర్కొంది. కానీ దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 128 దేశాలకు పైగా ఒమిక్రాన్ వ్యాప్తించిందని డబ్యూహచ్‌వో ప్రకటించింది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుదల ఆందోళన వ్యక్తం చేసింది.

ఒక్కో దేశంలో ఒక్కోలా..
అయితే ఒమిక్రాన్ సోకిన వారిలో ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని డబ్యూహెచ్‌వో అభిప్రాయపడింది. తొలి సారిగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్‌తో ఆస్పత్రులపాలయ్యే పరిస్థితి, మరణాల రేటు తక్కువగానే ఉందని పేర్కొంది. కానీ అన్ని దేశాల్లో ఇదే తరహాలో ఒమిక్రాన్ ప్రభావం ఉటుందని భావించడానికి వీలులేదని చెప్పింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒమిక్రాన్ వ్యాప్తి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. అగ్రరాజ్యం అమెరికాలో రోజుకూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని పేర్కొంది. ఆస్పత్రుల్లో చేరివారి సంఖ్య కూడా పెరిగిందని తాజా పరిస్థితులను వివరించింది.

వచ్చే మూడు వారాలో కరోనా ఉద్ధృతి
భారత్‌లో కరోన, ఒమిక్రాన్ కేసులు ఒక్కసారిగా భారీగా పెరడగంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే .. కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే రెండు మూడు వారాల్లో కరోనా ఉద్ధృతి గరిష్ఠ స్థాయికి చేరవచ్చని అంచనా వేసింది. కరోనా మళ్లీ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని తెలిపింది.
అటు ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు భారత్ ప్రభుత్వ సిద్ధంగా ఉంది. కరోనా నిబంధనలను కఠినతరం చేసింది. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని నిబంధనలు అమలు చేస్తోంది. పలు రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ప్యూలు అమలు చేస్తున్నాయి . స్కూళ్లు, కాలేజీలను మూసివేశారు.












Click it and Unblock the Notifications