వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా చివరి చక్రవర్తి తోటమాలిగా ఎందుకు పనిచేయాల్సి వచ్చింది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఐసిన్ జియోరో పుయి

ఆయన కథ అసాధారణంగా ఉంటుంది. ప్రపంచంలోనే నాలుగింట ఒక వంతు జనాభా కలిగిన సామ్రాజ్యానికి ఆయన చక్రవర్తి. కానీ, వారి వంశానికి చెందిన పూర్వీకుల్లా ఆయన కథ ముగియలేదు.

ఐసిన్ జియోరో పుయి కథ 20వ శతాబ్దంలో మొదలైంది. ఆయన 1906 ఫిబ్రవరిలో జన్మించారు. అప్పుడు పుయి మామ గ్వాంగ్షు చైనా చక్రవర్తిగా ఉన్నారు. గ్వాంగ్షు ఓ బలహీనమైన రాజు. దాంతో పుయి అత్త రాణి తాషి భర్తను గృహ నిర్బంధంలో ఉంచింది. భర్తను కీలుబొమ్మను చేసి, ఆయన పేరు మీద రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించింది.

పుయి చిన్న వయస్సులో ఉన్నప్పటికీ, రాణి తాషి భయంకరమైన ముఖం ఆయన మనస్సులో నాటుకుపోయింది.

''నేను ఆమెను మొదటిసారి చూసినప్పుడు భయంతో అరిచాను. నా పాదాలు వణికిపోయాయి. రాణి తాషి నాకు స్వీట్లు ఇవ్వాలని అక్కడున్నవారిని ఆజ్ఞాపించింది. కానీ నేను వాటిని నేలపై విసిరి నా తల్లి ఎక్కడ? అంటూ గట్టిగా అరిచాను'' అని కొన్ని సంవత్సరాల తర్వాత పుయి తాను రాసిన పుస్తకంలో వెల్లడించారు.

క్వింగ్ రాజవంశపు శాసనం

పట్టాభిషేకం రోజున బాగా ఏడ్చిన చక్రవర్తి..

గ్వాంగ్షు చక్రవర్తి 1908లో నవంబర్ 14న మరణించారు. మరుసటి రోజు రాణి తాషి కూడా కన్నుమూశారు. దీంతో 1908 డిసెంబర్ 2న, తన మూడో పుట్టిన రోజుకి రెండు నెలల ముందు, పుయిని చైనా చక్రవర్తిగా ప్రకటించారు. కొన్నాళ్ల తర్వాత, పుయి తన ఆత్మకథలో ''పట్టాభిషేకం రోజున నేను బాగా ఏడ్చాను'' అని రాసుకున్నారు.

రెండేళ్ల వయసులోనే పుయి క్వింగ్ రాజవంశపు 12వ చక్రవర్తి అయ్యారు. దీంతో చైనా సుదీర్ఘ రాచరిక చరిత్రలో చక్రవర్తి అయిన అతి పిన్న వయస్కుడిగా నిలిచారు.

పుయి మాంచు తెగకు చెందినవారు. వీరు మింగ్ రాజవంశాన్ని ఓడించారు. దీంతో 1644 సంవత్సరంలో క్వింగ్ రాజవంశానికి పునాది పడింది. ఈ రాజ వంశం పాలనలో, చైనా అధికార పరిధి విస్తరించింది. ఆ సమయంలో చైనా అధికార పరిధి షిన్‌జియాంగ్, మంగోలియా నుంచి పశ్చిమంలో టిబెట్ వరకు ఉంది. చైనా ప్రస్తుత రూపానికి చాలా వరకు నాడే బీజం పడింది.

ఈ కొత్త క్వింగ్ రాజవంశంలో వివిధ మతాలు, కులాల ప్రజలు అభివృద్ధి చెందడానికి అవకాశం లభించింది. దీంతో 18వ శతాబ్దం చివరి నాటికి చైనా ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.

క్వింగ్ రాజవంశపు చక్రవర్తులు రాజధాని బీజింగ్ మధ్యలో ఉన్న అద్భుతమైన రాజభవనాలలో నివసించారు. వీరికి రక్షణగా పటిష్ఠమైన సైనిక బలగం ఉండేది. మాంచు తెగలోని సంపన్న కుటుంబాలు వారి ఆస్థానంలో ప్రాతినిధ్యం వహించాయి.

అయితే 19వ శతాబ్దంలో, క్వింగ్ రాజవంశం బలహీనపడటం ప్రారంభమైంది. బ్రిటన్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్ దళాల సైనిక దాడుల నుంచి క్వింగ్ రాజవంశం చైనాను రక్షించలేకపోయింది.

తైపింగ్ తిరుగుబాటు

తైపింగ్ తిరుగుబాటు

1850లో, క్రైస్తవ మతాన్ని స్వీకరించిన చైనాకు చెందిన హాంగ్ షిక్వాన్ తనను తాను కొత్త రాజవంశానికి (తైపింగ్‌ హెవెన్లీ కింగ్‌డమ్‌) రాజుగా ప్రకటించుకున్నారు. ఆయన మద్దతుదారులు క్వింగ్ రాజవంశానికి వ్యతిరేకంగా పోరాడారు. ప్రజల నుంచి హాంగ్ షిక్వాన్‌కి విపరీతమైన మద్దతు లభించింది.

అనంతరం 14 సంవత్సరాల పాటు చైనాలో జరిగిన అంతర్యుద్ధంలో సుమారు 2 కోట్ల మంది ప్రాణాలను కోల్పోయారు. చివరికి ఈ యుద్ధంలో చైనా సైనికులు, యూరోపియన్ దళాలతో కలిసి తలపడాల్సి వచ్చింది.

19వ శతాబ్దపు చైనా చరిత్రలో తైపింగ్ తిరుగుబాటు, ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ తిరుగుబాటులో పాల్గొన్న చైనాలోని ఉత్తర ప్రావిన్సుల గ్రామీణ ప్రజలు తమ సమస్యలకు విదేశీయులే కారణమని విశ్వసించారు. వారు చైనా నుంచి విదేశీయులను తరిమికొట్టాలని భావించారు. 1898లో మళ్లీ తిరుగుబాటు చెలరేగింది. 1900లో వేసవి నాటికి వీరు బీజింగ్‌ను ముట్టడించారు. కానీ, సెప్టెంబర్ 1901లో ఈ ఉద్యమాన్ని దారుణంగా అణిచివేశారు.

తండ్రితో పూయి (ఒడిలో కూర్చున్న బాలుడు)

క్వింగ్ రాజవంశ ముగింపు

ఒకవైపు పుయి రాజభోగాలలో పెరుగుతుండగా, మరోవైపు ఆయన రాజవంశానికి వ్యతిరేకంగా విప్లవం ప్రారంభమైంది. చాలా మంది చైనీయులు క్వింగ్ రాజవంశం దేవుడి విశ్వాసాన్ని కోల్పోయిందని నమ్మడం ప్రారంభించారు. జిన్‌హాయ్ విప్లవం 1911లో ప్రారంభమైంది.

''గదిలోని ఓ మూల, రాణి డోవగర్ లాంగ్యూ రుమాలుతో తన కన్నీళ్లు తుడుచుకుంటూ కూర్చుంది. లావుగా ఉన్న వృద్ధుడు ఆమెతో వంగి మాట్లాడుతున్నారు. నేను అక్కడ కిటికీకి ఒకవైపు కూర్చుని చూస్తున్నాను. ఇద్దరు పెద్దవాళ్లు ఎందుకు ఏడుస్తున్నారని ఆశ్చర్యపోయాను'' అని పుయి ఆత్మకథలో నాడు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

267 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన క్వింగ్ రాజవంశం అధికారికంగా ముగియడంతో వారు ఏడుస్తున్నారు. కానీ ఆరేళ్ల పుయికి ఈ వాస్తవాల గురించి తెలియదు.

రాణి లాంగ్‌యూ (కుడి నుంచి మొదటి మహిళ), రాణి తాషి (మధ్యలో కూర్చున్న మహిళ), ఇతర రాజకుటుంబం

రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపన

రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపించే వరకు పరిస్థితి ఇలాగే ఉంది. ప్రతి ఒక్కరికీ ప్రతిదీ కొత్తగా ఉంది. రెండు వేల సంవత్సరాల నాటి రాచరికం చైనాలో ముగిసింది. అధికారం నుంచి తొలగించిన క్వింగ్ రాజవంశ కుటుంబాన్ని ఏం చేయాలో ఎవరికీ తెలియదు.

పుయిని మంచూరియాకు పంపాలా లేక బీజింగ్‌లో ఉండడానికి అనుమతించాలా అనే ప్రశ్న తలెత్తింది.

క్వింగ్ రాజవంశపు రాజులను విదేశీ రాజుల మాదిరిగానే పరిగణించాలని నిర్ణయించారు. రాజ కుటుంబం నివసించే బీజింగ్ 'ఫర్బిడెన్ సిటీ' లోనే ఉండడానికి అనుమతించారు. రాజ భవనం, తోటలు, అన్ని సౌకర్యాలు మునుపటిలాగే కొనసాగాయి.

దీంతో పుయి జీవన విధానంలో పెద్దగా మార్పులేమీ రాలేదు. ఆయన ఇకపై చక్రవర్తి కాదని చెప్పాల్సిన అవసరం ఎవరికీ రాలేదు. దీంతో ఆయన చాలా కాలం పాటు రాజభోగాలను అలానే అనుభవించారు.

''రిపబ్లిక్ ఆఫ్ చైనాగా ప్రకటించినా, నాగరికత 20వ శతాబ్దంలోకి ప్రవేశించినా, నేను ఇంకా చక్రవర్తి జీవితాన్ని గడుపుతున్నాను. 19వ శతాబ్దపు చీకటిలో ఉండిపోయాను'' అని పుయి రాసుకొచ్చారు.

చైనా

మళ్లీ చైనా చక్రవర్తిగా పుయి

కానీ, 1917లో పుయి మళ్లీ చైనా చక్రవర్తిగా కొనసాగాల్సి వచ్చింది. రాచరిక అనుకూల జనరల్ జాంగ్ షున్ తిరుగుబాటు చేయడంలో సఫలమయ్యారు. తనను తాను 'చక్రవర్తి నియమించిన పాలకుడు' అని జాంగ్ షున్ ప్రకటించుకున్నారు.

కానీ, జనరల్ జాంగ్ షున్ సాధించిన విజయం రెండు వారాలకే పరిమితమైంది. తిరుగుబాటుకు పుయి, ఆయన సన్నిహితులు బాధ్యులు కాకపోయినా, బాధ్యత వహించాల్సి వచ్చింది.

ఇలాంటి సందిగ్ధ వాతావరణంలో యువకుడైన పుయికి బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. ఆయన తన కుటుంబానికి దూరంగా వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయనతో నానీ వాంగ్ ఉన్నారు.

అప్పటికీ పుయిని ఏదో దైవిక వ్యక్తిగా ప్రజలు భావించేవారు. ఆయనని ఎవరూ బాధించేవారు కాదు.

11ఏళ్ల వయసులో పుయి

''నా సేవకులలో ఉన్న నపుంసకులను కొరడాతో కొట్టడం నా రోజు వారీ పని. ఎవరు ఏం చెప్పినా పట్టించుకునే వాడిని కాదు. ఆ సమయంలో నాలో కఠినత్వం, అధికార మత్తు బలంగా నాటుకుపోయి ఉన్నాయి'' అని పుయి రాశారు.

1919లో బ్రిటిష్ పరిశోధకుడు రెజినాల్డ్ జాన్‌స్టన్‌ కొద్దికాలం పుయికి బోధకుడిగా పని చేశారు.

''పుయి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే తెలివైన అబ్బాయి. ఆయన హాస్యప్రియుడు. అధికారం గురించి గొప్పగా చెప్పుకోరు'' అని బ్రిటిష్ ప్రభుత్వానికి పుయి గురించి రాశారు.

నెమ్మదిగా, పుయి టీనేజర్‌గా మారిపోయారు. ఆయనలోని తిరుగుబాటు స్వభావం, ఫోర్బిడెన్‌ సిటీ నుంచి బయటకు వచ్చేలా చేసింది. మాంచు ప్రజల సాంప్రదాయంలో భాగంగా ఇచ్చే గౌరవ మర్యాదలను ఆయన త్యజించారు.

అయితే, చక్రవర్తుల సంప్రదాయాన్ని అనుసరించి, ప్రజలు ఆడంబరంగా పుయికి వివాహాలు చేశారు.

''నేను మొత్తం నాలుగు వివాహాలు చేసుకున్నాను. కానీ నిజం ఏమిటంటే వారు నా నిజమైన భార్యలు కాదు. కేవలం ప్రదర్శన కోసం మాత్రమే'' అని పుయి రాశారు.

చైనా

'మంచుకావో చక్రవర్తి'గా పుయి

ఫర్బిడెన్‌ సిటీ వెలుపల ఉన్న ప్రపంచంలో, రాచరిక వ్యవస్థను ఎలా ముగించాలనే ప్రశ్నలకు చైనా సమాధానాల కోసం వెతుకుతోంది. కానీ 1924లో, వార్లార్డ్ ఫాంగ్ యుక్సియాంగ్ అధికారంలోకి రావడంతో, పుయి ఫోర్బిడెన్‌ సిటీ నుంచి బయటకు వెళ్లాల్సివచ్చింది.

19 సంవత్సరాల వయసులో, పుయి జపనీయులను ఆశ్రయించారు.

జపాన్ 1931లో మంచూరియాను ఆక్రమించింది. పుయీని 'మంచుకావో చక్రవర్తి'గా నియమించింది.

ఈశాన్య చైనాలోని మూడు చారిత్రక ప్రావిన్సులను విలీనం చేయడం ద్వారా జపాన్ ఈ ప్రావిన్సుని ఏర్పాటు చేసింది.

పుయి (కుడివైపు మొదటి వ్యక్తి)తో మాట్లాడుతున్న రష్యా జనరల్ ప్రిటోల్ (ఎడమ వైపు కూర్చున్న వ్యక్తి)

ఆ సమయంలో, ఆసియాలోని ఐదు జాతులు, జపనీస్, చైనీస్, కొరియన్, మాంచు, మంగోలులు, మంచుకావో జెండా కింద ఏకం అవుతున్నట్లు జపాన్ ప్రచారం చేసింది.

జపనీయులు దీనిని ఒక కొత్త నాగరికత పుట్టుకగా, ప్రపంచ చరిత్రలో ఒక మలుపుగా అభివర్ణించారని ఎడ్వర్డ్ బెహర్ తన 'ది లాస్ట్ ఎంపరర్' అనే పుస్తకంలో పేర్కొన్నారు.

'మంచుకావో చక్రవర్తి'గా, పుయి జపాన్ చేతిలో కీలుబొమ్మగా మారారు. ఆసియాలో తన పట్టును విస్తరించడానికి జపాన్ మంచుకావోను ఉపయోగించుకొంది.

సొంత ప్యాలెస్‌లో జపాన్ ఖైదీ పుయి

మంచుకావోలో పుయి జీవితం నరకంగా మారింది.

ప్రపంచంలో అత్యంత అనాగరిక ప్రభుత్వ వ్యవస్థ ఆ సమయంలో మంచుకావోలో అమలులో ఉంది. ప్రజలు పుయిని ద్వేషించేవారు.

పుయి తన సొంత ప్యాలెస్‌లో జపాన్ వద్ద ఖైదీగా ఉన్నారని ఎడ్వర్డ్ బెహర్ పేర్కొన్నారు.

చక్రవర్తిగా, జపనీయులు చెప్పిన ప్రతిదానిపై సంతకం చేయడం మాత్రమే ఆయన చేసే ఏకైక పని.

కానీ, పుయి ఆ తర్వాత బౌద్ధ సన్యాసిగా మారారు. సోవియట్ సైన్యం ఆయన్ను గుర్తించలేదు. పుయిని సైబీరియాలోని చిటా నగరానికి ఖైదీగా పట్టుకెళ్లారు. ఇతర ఖైదీల కంటే పుయికి ఎక్కువ సౌకర్యాలు కల్పించారు. అక్కడే పుయి కమ్యూనిజాన్ని అభ్యసించారు.

నలభై సంవత్సరాల పోరాటం తర్వాత, 1949 సంవత్సరంలో మావో జెడాంగ్ చైనాను కొత్త రిపబ్లిక్‌గా(పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా) ప్రకటించారు. దీంతో పుయి దేశానికి తిరిగి వచ్చే సమయం కూడా వచ్చింది. మావో పాలనలో ఎలా వ్యవహరిస్తారో అని పుయి భయపడ్డారు.

కానీ మావో, పుయిని విద్యా శిబిరానికి పంపారు. అక్కడ పుయి ఒక సామాన్యుడిలా 10 సంవత్సరాలు గడిపారు. 1960లో మావో ప్రభుత్వం పుయికి పౌరసత్వంతో పాటు స్వాతంత్ర్యం ఇచ్చింది.

పుయి

ఒకప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద జనాభాను పాలించిన వ్యక్తి, బీజింగ్ బొటానికల్ గార్డెన్‌లో తోటమాలిగా కూడా పని చేశారు. 1964లో ఆయనకి చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ ఎడిటర్‌గా బాధ్యతలు అప్పజెప్పారు.

మావో, చౌ ఎన్‌లై వంటి అగ్ర కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల ప్రోత్సాహంతో 'ఫ్రమ్ ఎంపరర్‌ టూ సిటిజన్‌' అనే పేరుతో పుయి తన ఆత్మకథను కూడా రాసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Why was Chinas last emperor work as gardener
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X