వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్: విటమిన్-డి తీసుకుంటే వైరస్ రాకుండా కాపాడుతుందా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
లాక్ డౌన్ సమయంలో విటమిన్ డి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు

కరోనావైరస్ సోకకుండా ఆపడానికి విటమిన్ డి పని చేస్తుందా లేదా అనే అంశం పై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలను సైంటిఫిక్ అడ్వైజరీ కమీషన్ ఆన్ న్యూట్రిషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ కేర్ ఎక్ససెలెన్స్ పరిశీలించారు.

వీరిచ్చిన సలహా ఏమిటి?

కరోనావైరస్ మహమ్మారి వలన చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో శరీరానికి విటమిన్-డి అందే అవకాశాలు తగ్గిపోతాయి.

సాధారణంగా విటమిన్ డి సూర్యరశ్మి నుంచి లభిస్తుంది.

ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా ఇంటి లోపలే ఎక్కువ సమయం గడిపే ప్రతి ఒక్కరు రోజుకు 10 మైక్రోగ్రాముల విటమిన్ డి తీసుకోవాలని బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్ ఎచ్ ఎస్) సూచిస్తోంది.

ఎక్కువ సమయం ఇంటి లోపలే ఉండేవారు, కేర్ హోమ్ లో నివసించేవారు, బయటకు వెళ్ళినప్పుడు కూడా శరీరం అంతా కప్పేలా దుస్తులు ధరించే వాళ్ళు సంవత్సరమంతా విటమిన్ డి తీసుకోవాలని, ఇంగ్లండ్ పబ్లిక్ హెల్త్ విభాగం సూచిస్తోంది.

విటమిన్-డి ఎందుకు అవసరం?

ఆరోగ్యకరమైన ఎముకలకు, దంతాలు, కండరాలకు విటమిన్ డి చాలా అవసరం. తగినంత విటమిన్ డి లేని పక్షంలో పిల్లల్లో రికెట్స్ వ్యాధికి దారి తీస్తుంది. పెద్దవాళ్లలో ఎముకలు అరిగిపోయి ఆస్టియోమలాసియా వచ్చే పరిస్థితికి దారి తీస్తుంది.

విటమిన్ డి రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుందని కూడా కొంత మంది సూచిస్తారు. అయితే దీని గురించి సరైన పరిశోధనలు లేవు.

లాక్ డౌన్ సమయంలో విటమిన్ డి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు

ఇది కరోనావైరస్ రాకుండా నివారిస్తుందా?

విటమిన్ డి తీసుకోవడం వలన కోవిడ్ 19 ని నివారిస్తుందనడానికి ప్రత్యేకమైన ఆధారాలేమీ లేవని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్ససెల్లెన్స్ తెలిపింది.

అయితే, మహమ్మారి సమయంలో విటమిన్ డి తీసుకోవడం వలన ఆరోగ్యానికి మంచిదని నిపుణులు భావిస్తున్నారు.

"సరైన శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం వలన కోవిడ్ 19 ని నివారించడానికి మేజిక్ పరిష్కారంగా విటమిన్ డి ని సూచించకూడదు. కానీ, ప్రజల పోషకాహార స్థాయిలు సరిగ్గా ఉండటం కోసం ఆరోగ్యకరమైన జీవనానికి ఇవి సూచించవచ్చని” బిఎంజె న్యూట్రిషన్ , ప్రివెన్షన్ అండ్ హెల్త్ లో ప్రచురించిన నివేదిక పేర్కొంది.

కరోనావైరస్ వచ్చిన వారికి విటమిన్ డి ఇవ్వడం వలన ఎటువంటి ఉపయోగం ఉండకపోవచ్చని కొంత మంది పరిశోధకులు చెబుతున్నారు.

విటమిన్ డి లో ఉండే యాంటీ ఇంఫ్లమేటరీ లక్షణాల వలన శరీరం వైరస్ తో పోరాడే రోగ నిరోధక శక్తి ని కూడా తగ్గించే అవకాశం ఉందని, లివర్ పూల్ యూనివర్సిటీలో పని చేస్తున్న మెడిసిన్ ప్రొఫెసర్ జోన్ రోడ్స్ అన్నారు.

అయితే, దీనిని నిర్ధరించడానికి మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

విటమిన్ డి ఎక్కువగా తీసుకోవాలా?

విటమిన్ డి తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ మోతాదు మించి ప్రతి రోజూ తీసుకోవడం వలన దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాలు చూపించే అవకాశం ఉంది.

విటమిన్ డి లభించే సప్లిమెంట్లు తీసుకోవాలనుకుంటే:

ఒకటి నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లలు రోజుకి 50 మైక్రోగ్రాములను మించి, 12 నెలల లోపు చిన్నారులు 25 మైక్రోగ్రాములు మించి తీసుకోకూడదు.

పెద్ద వాళ్ళు రోజుకి 100 మైక్రోగ్రాములు కంటే ఎక్కువ తీసుకోకూడదు. డాక్టర్ సూచించిన మోతాదులోనే విటమిన్ డి తీసుకోవాలి.

కిడ్నీ సమస్యలున్న వారు విటమిన్ డి ని సురక్షితంగా తీసుకోలేరు.

తృణ ధాన్యాలు, యోగర్ట్ లో కూడా విటమిన్ డి లభిస్తుంది

విటమిన్ డి మందులు ఎక్కడ కొనుక్కోవాలి?

విటమిన్ డి సప్లిమెంట్లు మందుల షాపుల లోను, సూపర్ మార్కెట్లలో లభిస్తాయి. అవసరమైన దాని కంటే ఎక్కువ కొని నిల్వ చేసుకోవద్దని నిపుణులు చెబుతారు.

విటమిన్ డి సప్లిమెంట్ల పై డి-3 విటమిన్ ఉన్నట్లు రాసి ఉంటుంది.

డి 2 విటమిన్ ని మొక్కలు ఉత్పత్తి చేస్తే ,డి3 ని శరీరమే తయారు చేసుకుంటుంది

పిల్లలకి విటమిన్ డ్రాప్ లు అందుబాటులో ఉంటాయి.

ఆహారం సంగతి ఏమిటి?

సరైన పోషకాహారం తీసుకోవడం వలన శరీరానికి తగిన రోగ నిరోధక శక్తి సమకూరినప్పటికీ , ఏ ఒక్క ఆహార పదార్ధమూ ఒక్క సారిగా శరీర రోగ నిరోధక శక్తిని పెంచలేదు.

కేవలం ఆహరం ద్వారా విటమిన్ డి ని పొందడం సాధ్యం కాదు.

మహమ్మారి ఉన్నా లేకపోయినా ఆరోగ్యం కోసం పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం

చేపలు, గుడ్లలో విటమిన్ డి లభిస్తుంది. కొన్ని రకాల తృణ ధాన్యాలు, యోగర్ట్ లో కూడా విటమిన్ డి ఉంటుంది.

సూర్యరశ్మిలో ఉంటే విటమిన్ డి లభిస్తుందా

సూర్యరశ్మిలో ఎక్కువ సేపు ఉండటం వలన ఎక్కువ విటమిన్ డి లభిస్తుందని చెప్పలేం. తీవ్రమైన సూర్యరశ్మి శరీరానికి హాని చేస్తుంది.

సూర్యరశ్మి లోకి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ లను వాడి చర్మాన్ని సంరక్షించుకుంటూ ఉండాలి.

పిల్లలు, చిన్నారులు, గర్భిణీల సంగతేమిటి?

తల్లి పాలు పడుతున్న చిన్నారులకు ప్రతి రోజు 8. 5 నుంచి 10 మైక్రోగ్రాముల విటమిన్ డి ని ఇవ్వాలి

బయట పాలు ఇచ్చే పిల్లలకు విటమిన్ డి అదనంగా ఇవ్వకూడదు.

ఒకటి నుంచి నాలుగు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు రోజుకు 10 మైక్రో గ్రాముల విటమిన్ డి ఇవ్వాలి

గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, మిగిలిన అన్ని వయసుల వారు రోజుకు 10 మైక్రోగ్రాముల విటమిన్ డి తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
How is Vitamin-D helpful in killing the corona virus
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X