మొబైల్‌ మోజులో కాలు పోగొట్టుకొంది, ఏమైందంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

షాంఘై: చేతిలో ఫోన్ ఉంటే పక్కన ఏం జరుగుతోందో కూడ చూసుకోకపోవడంతో ఓ యువతి తన కాలును పోగోట్టుకొంది.. ఈ ఘటన చైనాలో చోటు చేసుకొంది.చేతిలో ఫోన్ చూసుకొంటూ లిఫ్ట్ లోపలకు అడుగేసింది. కానీ లిఫ్ట్ డోర్లు మూసుకుపోవడంతో ఆ యువతి కాలును పోగోట్టుకోవాల్సి వచ్చింది.

స్మార్ట్‌ఫోన్ జీవితంలో భాగంగా మారింది. అయితే అదే సమయంలో ఫోన్ మోజులో పడి పరిసరాలను కూడ గమనించని స్థితిలో ప్రమాదాలను కూడ కొని తెచ్చుకొన్న ఘటనలు కూడ లేకపోలేదు.

Woman in China has her leg cut off by lift doors

స్మార్ట్‌ ఫోన్‌ జీవితంలో ఒక భాగం అయిపోయింది. చేతిలో ఫోన్‌ ఉటే చాలు.. పక్కన ఏం జరుగుతోందన్న విషయాన్ని కూడా జనాలు గమనించడం లేదు. స్మార్ట్‌ మాయలో కొట్టుకుతున్న కుర్రకారు.. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. ఇటువంటి ఘటనే చైనాలోని షాంఘైలో జరిగింది. స్మార్ట్‌ ఫోన్‌ మాయలో ఏం జరుగుతోందో కూడా పట్టించుకోక.. చివరకు అత్యంత దారుణ స్థితిలో కాలును కోల్పోయింది.

షాంఘైలోని ఒక ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న 28 ఏళ్ల యువతి ఆఫీస్‌ నుండి ఇంటికి వెళ్లే క్రమంలో లిఫ్ట్‌ దగ్గరకు వచ్చింది. మొబైల్‌ చూసుకుంటూనే... లిఫ్ట్‌లోపలకు అడుగులు వేసింది. అయితే అప్పటికే లిఫ్ట్‌ డోర్లు మూసుకుపోతున్నాయి.

ఈ విషయాన్ని గమనించని యువతి అలాగే లోపలకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె ఒక కాలు బయట ఉండగానే లిఫ్ట్‌ వేగంగా కదిలింది. లిఫ్ట్‌ వేగం అందుకోవడంతో.. ఆమె కాలు.. అక్కడే తెగిపడిపోయింది. దీంతో స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవిలో రికార్డయ్యాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman in China has allegedly had her leg severed by a faulty lift after getting it trapped between the closing doors.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి