ఎన్నికలు: హఫీజ్ సయీద్‌కు పాక్ ప్రజలు గట్టి షాక్, ఒక్క సీటు రాలేదు
కరాచి: ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ ఓటర్లు షాకిచ్చారు. ఆయన మద్దతిచ్చిన అల్లాహో అక్బర్ తెహ్రిక్ (ఏఏటీ) పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆయన మద్దతిచ్చిన పార్టీని ప్రజలు తిరస్కరించారు. ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. అయితే ఆయన మద్దతుదారులుగా చెప్పుకున్న కొందరు స్వతంత్రులు గెలిచారు.
మొత్తం 272 స్థానాలకుగాను ఎన్నికలు జరుగగా ప్రభుత్వ ఏర్పాటులో ఇండిపెండెంట్లు కీలకం కానున్నారు. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పార్టీ 120 స్థానాల్లో, పీఎంపఎల్ఎల్ 61 స్థానాల్లో, పీపీపీ 40 స్థానాల్లో ముందంజలో ఉంది. దాదాపు 60 శాతం కౌంటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి పదిహేను నుంచి ఇరవై స్థానాలు తక్కువగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మ్యాజిక్ ఫిగర్‌కు ఏ పార్టీ చేరుకోని పరిస్థితి ఏర్పడటంతో పీపీపీ మద్దతు కోరాలని ఇమ్రాన్ ఖాన్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. లేదంటే ఇండిపెండెంట్లు, చిన్న పార్టీలు కీలకం కానున్నారు. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని పీఎంఎల్ఎన్ నేతలు ఆరోపించారు. ఈ ఆరోపణలను సీఈసీ సర్దార్ ముహమ్మద్ రజా కొట్టిపారేశారు. కొన్ని సాంకేతిక ఇబ్బందులు మినహా ఈ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా జరిపించామన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications