వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: జోఫ్రా ఆర్చర్ వర్సెస్ పృథ్వీ షా: పోటీలో ఎవరు గెలుస్తారు..?

|
Google Oneindia TeluguNews

ఐపీఎల్ టీట్వంటీలో భాగంగా మరికాసేపట్లో రాజస్థాన్ రాయల్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య సమరం జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి పృథ్వీ షా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్‌లో పృథ్వీ షా 10 ఓవర్ల వరకు నిలదొక్కుకున్నాడంటే స్కోరు 100 దాటడం ఖాయమని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన గత రెండు మ్యాచుల్లో గెలిచిందంటే అందుకు కారణం పృథ్వీ షా అని చెప్పక తప్పదు. ఇలా ఢిల్లీ జట్టుకు ప్రధాన ఆయుధంగా ఈ హార్డ్ హిట్టర్ ఉన్నాడు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌ బౌలింగ్ విభాగంలో తురుపు ముక్క జోఫ్రా ఆర్చర్ ఉండనే ఉన్నాడు. ఇప్పుడు వీరిద్దరి మధ్య స్ట్రాంగ్ కాంపిటీషన్ కనిపించే అవకాశాలున్నాయి.

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు జోఫ్రా ఆర్చర్ సగం బలం. ఇటు బౌలింగ్‌లో సత్తా చాటడమే కాకుండా బ్యాట్‌తో కూడా ప్రత్యర్థులకు సమాధానం చెప్పగలిగే సత్తా ఉన్న ఆటగాడు జోఫ్రా ఆర్చర్. రాజస్థాన్ రాయల్స్‌ బౌలింగ్ విభాగంలో ఒక్క జోఫ్రా ఆర్చర్ తప్పితే ఆ స్థాయిలో ప్రదర్శన ఇచ్చే బౌలర్ కనిపించడం లేదు. ఇదే ఆ జట్టు ప్రధాన బలహీనతగా చెప్పుకోవచ్చు. బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో జోఫ్రా ఆర్చర్ పైనే సగం భారం పడుతోంది. ఇక పృథ్వీ షాను జోఫ్రా ఆర్చర్ ఎలా కట్టడి చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ పృథ్వీ షా రెచ్చిపోతే జోఫ్రా ఆర్చర్ కూడా ఏమీ చేయలేని పరిస్థితే తలెత్తవచ్చనేది కొంతమంది క్రికెట్ అభిమానలు చర్చించుకుంటున్నారు.

 IPL 2020:Its Jofra Archer vs Prithvi Shah, Who will win the contest?

అసలే షార్జాలో జరగుతున్న మ్యాచ్. ముందే గ్రౌండ్ చిన్నది. అలాంటి మాంచి ఫామ్‌లో ఉన్న పృథ్వీ షా రెచ్చిపోతే రాజస్థాన్ రాయల్స్‌కు చుక్కలు కనిపించే అవకాశాలున్నాయి. అదే జోఫ్రా బంతితో రెచ్చిపోతే మాత్రం ఢిల్లీకి తిప్పలు తప్పవు. షార్ట్ పిచ్ బాల్స్‌ను హుక్ చేయడంలో పృథ్వీ షా దిట్ట అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు షార్ట్ పిచ్ బంతులే జోఫ్రా ఆర్చర్ ప్రధాన అస్త్రంగా ఉంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య పోరు చాలా ఆసక్తికరంగా మారే అవకాశం ఉందంటున్నారు క్రికెట్ నిపుణులు.

ఆర్చర్ వేగవంతమైన బంతులు సంధిస్తూ పరుగులను కూడా నియంత్రించడంలో సక్సెస్ అవుతున్నాడు కాబట్టే అతని ఎకానమీ రేటు 7.0గా ఉంది. అయితే కీలకమైన సమయాల్లో వికెట్లు తీయడంలో జోఫ్రా ఆర్చర్ విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు ఆర్చర్ ఆడిన ఐదు మ్యాచుల్లో ఐదు వికెట్లు తీశాడు. మరోవైపు ఐదు మ్యాచులు ఆడిన పృథ్వీ షా 147.93 స్ట్రైక్‌ రేట్‌తో 179 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. ప్రస్తుతం రెండు జట్ల మధ్య గణాంకాలు చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకే ఎక్కువ విజయావకాశాలున్నాయి. కానీ ఐపీఎల్‌లో ఏమైనా జరగొచ్చు. ఆర్చర్ రెచ్చిపోతే ఢిల్లీ చతికిలపడే అవకాశాలూ లేకపోలేదు.

English summary
Jofra Archer is the best bowler in the Rajasthan Royals ranks, while Prithvi Shaw has been quite the package on top of the Delhi Capitals batting order. This will be a serious face-off in Sharjah on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X