IPL 2023 DC VS GT: నో డౌట్..ఆ ముగ్గురు రెచ్చిపోవడం ఖాయం,పరుగుల సునామీనే..!

ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మంగళవారం ఏప్రిల్ 4వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. రెండు జట్లు గెలుపుపై ధీమాతో ఉన్నాయి. అంతేకాదు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్‌తో ఓటమి చవిచూడగా, గుజరాత్ టైటాన్స్ జట్టు తన తొలి మ్యాచ్‌ బలంగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల బలబలాలు, ఈ రెండు జట్లలోని కీలక ఆటగాళ్లు ఎవరనేదానిపై విశ్లేషణ చేద్దాం.

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తన తొలి మ్యాచ్‌ను లక్నో సూపర్ జైంట్స్‌తో శనివారం రోజున తలపడింది. అయితే 194 పరుగుల లక్ష్య చేదనలో ఢిల్లీ జట్టు తడబడింది. చివరకు 50 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ జట్టు బలమైన చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుపై గెలిచింది.అయితే ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడి మొత్తం టోర్నీకే దూరమయ్యాడు.

ఇక స్టేడియం విషయానికొస్తే ఏప్రిల్ 4వ తేదీన జరిగే మ్యాచ్‌కు అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. ఈ గ్రౌండ్‌ పై పరుగుల వరద పారడం ఖాయమని తెలుస్తోంది. దీంతో ఇరు జట్లలోని బ్యాట్స్‌మెన్ రెచ్చిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మంగళవారం మ్యాచ్‌లో ఇరు జట్ల నుంచి ఏ బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయి పరుగుల సునామీ సృష్టిస్తారో ఇప్పుడు చూద్దాం.

shubman gill gujarat titans

శుభ్‌మన్ గిల్: గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న శుభ్‌మన్ గిల్ కచ్చితంగా రెచ్చిపోతాడనే సంకేతాలు వస్తున్నాయి. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 63 పరుగులు చేశాడు. అంతేకాదు పవర్‌ ప్లే ఆప్షన్‌ను చాలా బాగా వినియోగించుకుని బంతిని బౌండరీకి తరలించాడు.ఢిల్లీ వికెట్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంది కాబట్టి గిల్ రెచ్చిపోతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

పృథ్వీ షా: ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా లక్నో సూపర్ జైంట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు బౌండరీలు బాదాడు. స్వింగ్‌లో ఉన్నాడనుకునే లోపే వుడ్ వేసిన బంతికి ఔటయ్యాడు.దేశీ క్రికెట్‌లో స్థిరమైన ప్రదర్శన కనబర్చడంతో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు పృథ్వీషాకు పిలుపొచ్చింది.అయితే బెంచ్‌కే పరిమితమైన షా ఈ ఐపీఎల్ చక్కగా వినియోగించుకుంటాడనే ఫ్రాంఛైజీ భావిస్తోంది.

మిచెల్ మార్ష్: ఢిల్లీ క్యాపిటల్స్ తరపున బరిలోకి దిగుతున్న ఈ ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌‌గా వెనుదిరిగాడు. వుడ్ వేసిన ఇన్‌స్వింగర్‌కు డకౌట్ అయ్యాడు.మిచెల్ మార్ష్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 194 పరుగులు బాదాడు. ఇక మంగళవారం రోజున జరిగే మ్యాచ్‌లో అంతా అనుకూలిస్తే మిచెల్ మార్ష్ రెచ్చిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+