IPL auction: దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ రేటెంతో తెలుసా: ఏ క్రికెటర్ కూడా టచ్ చేయలేనంతగా
చెన్నై: చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 మెగా టోర్నమెంట్‌కు సంబంధించిన మినీ వేలంపాట హాట్‌గా సాగుతోంది. చెన్నై గ్రాండ్ చోళ హోటల్.. దీనికి వేదికైంది. తాము ఆరాధించే క్రికెటర్లను ఏ ఫ్రాంఛైజీలు బుట్టలో వేసుకుంటాయోననే ఉత్కంఠత నెలకొంది. మెరికెల్లాంటి కొందరు బ్యాట్స్‌మెన్లు, ఆల్‌రౌండర్ల పేర్లు వేలంపాట లిస్ట్‌లో చేరడం..ఈ మినీ వేలంపాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ మినీ వేలం పాట ద్వారా 61 మంది క్రికెటర్లను ఎనిమిది ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయనున్నాయి.
మినీ స్టేట్ బడ్జెట్: ఐపీఎల్ ఫ్రాంఛైజీలు క్రికెటర్లకు ఇచ్చిన జీతాలు ఎన్ని వేల కోట్లో తెలుసా?
ఇందులో 22 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. దీనికోసం 196.6 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతోన్నాయి. మొత్తం 292 మంది క్రికెటర్లు మినీ ఆక్షన్ కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ సారి ఐపీఎల్ మినీ వేలంపాటలో కొన్ని అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. నాసిరకం ఆటతీరుతో పంజాబ్ కింగ్స్ జట్టు నుంచి అవమానకరంగా బయటికొ్చ్చేసిన ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను భారీ రేటుకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

ఈ సారి అతణ్ని తీసుకోవడమే కష్టమనే అంచనాలు ఉన్న పరిస్థితుల మధ్య రాయల్ ఛాలెంజర్స్.. పోటీ పడి మరీ కొనుగోలు చేసింది. ఏకంగా 14 కోట్ల 25 లక్షల రూపాయలతో అతన్ని తీసుకుంది. ఈ మొత్తమే హయ్యెస్ట్‌గా ఉండొచ్చనే అంచనాలు వ్యక్తం అయ్యాయి. ఆ కాస్సేపటికే అది కాస్తా తలకిందులైంది. దక్షిణాఫ్రికాకు చెందిన ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్.. రికార్డులను తిరగరాశాడు. కళ్లు చెదిరే రేటుకు అమ్ముడుపోయాడు. రాజస్థాన్ రాయల్స్.. 16 కోట్ల 25 లక్షల రూపాయలకు మోరిస్‌ను కొనుగోలు చేసింది.
ఏ క్రికెటర్ కూడా అందుకోలేని రేటు ఇది. ఐపీఎల్ మెగా టోర్నమెంట్ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా కొమ్ములు తిరిగిన ఏ ఒక్క క్రికెటర్ కూడా ఈ మొత్తాన్ని అందుకోలేదు. అలాంటి ఘనతను క్రిస్ మోరిస్ సాధించాడు. భారత క్రికెటర్లు గానీ, విదేశీ ప్లేయర్లు గానీ 16.25 కోట్ల రూపాయలకు అమ్ముడు పోవడం ఇదే తొలిసారి. క్రిస్ మోరిస్ రాకతో రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విభాగం మరింత బలోపేతమైనట్టు కనిపిస్తోంది. ఇప్పటికే జోఫ్రా ఆర్చర్ ఉన్నాడక్కడ. బిగినింగ్, డెత్ ఓవర్లలో ఎలాంటి బ్యాట్స్‌మెన్లయినా కట్టి పడేసే సత్తా వారిద్దరికీ ఉంది.