Kadapa : అప్పుల బాధతో ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య...
కడప ఎయిర్‌పోర్టులో ఎస్‌పీఎఫ్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్ నాయబ్ రసూల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం నాడు కడప పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి.
నాయబ్ రసూల్ ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన వ్యక్తి. ఈయన గత నాలుగేళ్ల నుంచి కడప విమానాశ్రయంలో ఎస్‌ఫీఎఫ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కడపలోని ఆలంఖాన్‌పల్లెలో నివాసం ఉంటున్నాడు. నాయబ్‌కు ఏడాదిన్నర క్రితం నసీమా అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి సంతానం కలుగలేదు. రసూల్ ఇటీవల కాలంలో అక్కడక్కడ అప్పులు చేశారు. అయితే, ఓ పక్క పిల్లలు కలగలేదన్న బాధ, మరోవైపు అప్పుల భారం రసూల్‌ను వెంటాడాయి. అయితే, రసూల్ ఇటీవల కాలంలో చాలామంది దగ్గర అప్పులు చేశాడు.

భార్య ఇంట్లో లేని సమయంలో ఊరేసుకున్న కానిస్టేబుల్..
అయితే, ఈ క్రమంలో రసూల్ భార్య నసీమా అనారోగ్యంతో మూడు రోజుల కిందటే పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక, ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో రసూల్ పిల్లల గురించి, అప్పుల గురించి బాధపడుతూ ఇంతటి ఘోరానికి పాల్పడ్డాడు. మానసిక వేదనను భరిస్తూ తీవ్ర మనస్థాపంతో గదిలోని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. అయితే, పోలీసులు వెంటనే ఘటనస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడ్డానికి అప్పులే కారణమా? లేక ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయోమో అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications