బండి సంజయ్ పై దాడి ఘటన .. రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమ యాత్ర సందర్భంగా తనపై దాడి చేసిన పోలీసులను వదిలిపెట్టేది లేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. శాంతి యుతంగా పాదయాత్ర చేస్తున్న తనను అడ్డుకోవడమే కాకుండా పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. తనపై పోలీసులు దాడికి దిగారని దీనిపై వెంటనే విచారణ జరపాలని ఎన్‌హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు బండి సంజయ్ . ఇక ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్‌హెచ్ఆర్‌సీ కేసు నమోదు చేసింది.

బాబు అంతిమ యాత్ర సందర్భంగా ఒక ఎంపీ అన్న మర్యాద కూడా లేకుండా, శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తనపై పోలీసులు ప్రవర్తించిన తీరు అప్రజాస్వామికమన్న సంజయ్ న్యాయ పోరాటానికి దిగారు. పార్లమెంట్ వేదికగా చర్చ పెడతానని, తెలంగాణ పోలీసులను వదిలిపెట్టేది లేదని చెప్పిన ఆయన దౌర్జన్యం చేసిన తెలంగాణ పోలీసు అధికారులపై పార్లమెంటులో ప్రివిలైజ్‌ మోషన్‌ పెట్టారు. ఇక అంతే కాదు జాతీయ మాన హక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేశారు.

 Bandi Sanjay attack incident: NHRC notices to state government and police

దీంతో ఎన్‌హెచ్ఆర్‌సీ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులుగా సీఎస్‌, హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్ సీపీ, దాడి ఘటనలోని పోలీస్ అధికారులను చేర్చింది.ఇక అంతే కాకుండా బండి సంజయ్ పోలీసుల దాడి ఘటనపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. తన హక్కులకు పోలీసులు భంగం కలిగించారని ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. ఆర్టీసీ డ్రైవర్ బాబు అంతిమయాత్రలో తనపై దాడికి పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎంపీ బండి సంజయ్ కోరారు. ఇక కరీంనగర్ ఇన్‌చార్జ్‌ సీపీ సత్యనారాయణ, అడిషనల్ డీసీపీ సంజీవ్, ఏసీపీ నాగయ్య, ఇన్‌స్పెక్టర్ అంజయ్యపై చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+