సీఎం ఇలాకాలోనే వసతులు లేవు, ప్రవీణ్ కుమార్ మండిపాటు
బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ విమర్శల జడివాన కంటిన్యూ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ లక్ష్యంగా కామెంట్లు కొనసాగుతున్నాయి. ఏడేళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ పేరు చెప్పడమే కానీ.. ఆచరణలో శూన్యం అని విమర్శించారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోనే పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పారు. మరీ మిగతా చోట్ల ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పాలన పడకేసిందని.. ఇకనైనా మేల్కొవాలని హితవు పలికారు. కేసీఆర్ సర్కార్ ఏం చేస్తుందో.. ఏం చేయడం లేదో ప్రజలు చూస్తున్నారని పేర్కొన్నారు.
మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు కేటాయించిన ముట్రాజ్‌పల్లి ఆర్అండ్ఆర్ కాలనీలో ఇళ్లు అత్యంత నాసిరకంగా ఉన్నాయని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎందుకు అలా నిర్మించారు అని ప్రశ్నించారు. వారంతా ఒకప్పుడు గౌరవంగా బతికిన వారు అని గుర్తుచేశారు. ప్రాజెక్టు వల్ల ఇప్పుడు అడ్డా కూలీలుగా మారారన్నారు. ఇక్కడ కూలీలు కూడా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. పిల్లల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. పిల్లలకు ఏ స్కూల్‌కు వెళ్లాలో తెలియదన్నారు. వారు ఏం చదువుతున్నారో చూసే నాథుడే లేడని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. కీలకమైన విద్య మిథ్య అవుతోందని.. పట్టించుకునే నాథుడే లేడని విమర్శించారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని కోరారు.

అంతేకాదు వైద్యారోగ్య సదుపాయాలు కూడా సరిగా లేవని చెప్పారు. కీలక రంగంలో ఇలా చేయడం మంచి పద్దతి కాదన్నారు. ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని చెప్పారు. కానీ ఇక్కడ ఎలాంటి ఆరోగ్య సదుపాయాలు లేవన్నారు. జనం బిక్కు బిక్కు మంటూ వెళ్లదీయాల్సిన పరిస్థితి అని వివరించారు. రాబోయేది బహుజన రాజ్యం అని చెప్పారు. అందులో కన్నీళ్లు ఉండవని స్పష్టంచేశారు. కొత్త విధానాలు తీసుకోస్తామని వివరించారు. రెండేండ్లల్లో బహుజన రాజ్యం వస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
సమయం దొరికితే చాలు ప్రవీణ్ కుమార్ కూడా రెచ్చిపోతున్నారు. తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. టీఆర్ఎస్ సర్కార్ టార్గెట్‌గా కామెంట్లు చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీ నేతలకు సరి సమానంగా విరుచుకుపడుతున్నారు. బంగారు తెలంగాణ, ఉద్యోగాల గురించి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. పేదల ఆకలికేకలు ప్రభుత్వాలకు పట్టవని విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications