అర్దరాత్రి బండి సంజయ్ అరెస్ట్..!!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అర్ద్రరాత్రి దాటిన తరువాత అరెస్ట్ చేసారు. బుధవారం అర్ధరాత్రి కరీంనగర్‌లోని సంజయ్‌ నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి బొమ్మల రామారం పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

అరెస్ట్ సమయంలో బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. దాంతో, బండి సంజయ్‌ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులోనే సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

 Bandi Sanjay arrested

తెలంగాణలో వరుసగా రెండో రోజు ప్రశ్న పత్రం బయట వాట్సప్ లో సర్క్యులేట్ అయింది. హిందీ పేప‌ర్ కాపీయింగ్ కేసులో ముఖ్య నిందితుడు బండి సంజ‌య్‌కు స‌న్నిహితుడు అని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే హిందీ పేపర్‌ లీక్‌ కేసులో నిందితుడిగా భావిస్తోన్న ప్రశాంత్ హిందీ పేపర్ ను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపించారని వరంగల్‌ సీపీ రంగనాథ్ తెలిపారు.

దీనికి సంబంధించి విచారణ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇదే వ్యవహారం పైన బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య సోషల్‌ మీడియాలో ఒక పార్టీపైన మరో పార్టీ ఆరోపణలు చేసుకుంది. ప్రశాంత్‌కు, సంజయ్‌కు సంబంధం ఉందంటూ బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. అదుపులోకి తీసుకొనే క్రమంలో పోలీసులకు - బండి సంజయ్ కు మధ్య వాగ్వాదం జరిగిందది.

ఇదే సమయంలో బీఆర్ఎస్ లోని కొందరు నేతలతో ప్రశాంత్ దిగిన ఫొటోలను బీజేపీ నేతలు బయటకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో అర్ద్రరాత్రి దాటిన తరువాత బండి సంజయ్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చారనే సమాచారంతో బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని నినాదాలు చేసారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

గతంలో గ్రూపు -1 పరీక్ష ప్రశ్నా పత్రాల లీకేజ్ వ్యవహారంలోనూ బండి సంజయ్ కు సిట్ రెండు సార్లు నోటీసులు జారీ చేసింది. కానీ, ఆయన విచారణకు హాజరు కాలేదు. ఇప్పుడు పదో తరగతి ప్రశ్నా పత్రాల విషయంలో బండి సంజయ్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి అరెస్ట్ వారెంట్ లేకుండా తన భర్తను అరెస్ట్ చేసారని బండి సంజయ్ సతీమణి వాపోయారు. సంజయ్ ను అరెస్ట్ చేయటం పైన బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+