ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏంటి..?
భారత ప్రభుత్వ నిర్దేశనాల ప్రకారం ప్రతి వ్యాపారము చట్టపరంగా రిజిస్టర్ చేయబడి ఉండాలి. వ్యవస్థాపకులు లేదా వ్యాపార యజమానులు తమ వ్యాపారాలను రిజిస్టర్ చేసుకునే సమయంలో ఉత్తమమైన వ్యాపార నిర్మాణ వ్యవస్థను ఎంచుకోవాలి. కొంతమంది తమ వ్యాపారాన్ని భాగస్వామ్య సంస్థగా రిజిస్టర్ చేయవచ్చు, మరికొంతమంది దానిని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ చేయవచ్చు.
ఒక వ్యాపారాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ చేయడము వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి మరియు కార్యకలాపాలలో అనుకూలతను అందిస్తుంది. అయితే, ఒక వ్యాపారాన్ని ప్రైవేట్ లిమిటెడ్ గా రిజిస్టర్ చేసేముందు రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ గురించి అర్థంచేసుకోవడములో ఈ బ్లాగ్ మీకు సహాయపడుతుంది.

ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏమిటి
ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే పరిమిత ప్రైవేట్ యాజమాన్యం కలిగిన వ్యాపార సంస్థ రకము. భారతదేశములో, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో గరిష్ఠంగా 200 మంది వాటాదారులు ఉండవచ్చు. ఈ వాటాదారులందరు ప్రైవేట్ గా కంపెనీ షేర్లను కలిగి ఉండాలి మరియు వాటిని పబ్లిక్ గా వాణిజ్యం చేయలేరు. ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క ప్రయోజనాలలో ఉత్తమమైనది దాని పరిమితమైన లయబిలిటి, ఇది దివాలా సందర్భములో వాటాదారుల వ్యక్తిగత ఆస్తులను రక్షిస్తుంది.
కంపెనీ రిజిస్ట్రేషన్ లో వివిధ రకాలు ఏమిటి
ఒక వ్యాపార యజమాని ఎంచుకునే అవకాశం ఉన్న కంపెనీ రిజిస్ట్రేషన్స్ యొక్క కొన్ని రకాలు ఈ దిగువన ఇవ్వబడ్డాయి:
• భాగస్వామ్య సంస్థ రిజిస్ట్రేషన్
• లిమిటెడ్ కంపెనీ (పిఎల్సి)
• ఏకైక యజమాని సంస్థ రిజిస్ట్రేషన్
• లిమిటెడ్ లయబిలిటి భాగస్వామ్య (ఎల్ఎల్పి) రిజిస్ట్రేషన్
• ఒకే వ్యక్తి కంపెనీ (ఓపిసి) రిజిస్ట్రేషన్
• ఎన్జిఓ రిజిస్ట్రేషన్ (సెక్షన్ 8 కంపెనీ రిజిస్ట్రేషన్)
ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిజిస్టర్ చేయడం ఎలా
ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిజిస్టర్ చేయుటకు మీరు తీసుకోవలసిన చర్యలు ఈ దిగువన ఇవ్వబడ్డాయి:
డిజిటల్ సంతకం తీసుకోవడం
ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్ చేయటానికి డిజిటల్ సంతకాలు తప్పనిసరి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ కావడముతో ఫార్మ్ లో డిజిటల్ సంతకం తీసుకోవాలి (ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ మరియు ప్లాట్ఫార్మ్స్ చే అందించబడినది). డిజిటల్ సంతకాలు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (ఏఓఏ) మరియు మెమొరాండం ఆఫ్ అసోసియేషన్ (ఎంఓఏ) కింద సాక్షులు మరియు సబ్స్క్రైబర్స్ అందరికి డిజిటల్ సంతకాలు తప్పనిసరిగా కావాలి. భారత ప్రభుత్వముచే గురించబడిన అధికారుల నుండి మీరు డిజిటల్ సంతకం తీసుకోవచ్చు. ఇక్కడ, మీరు డిఎస్సి యొక్క క్లాస్ 3 వర్గాన్ని తీసుకోవాలి.
డిఐఎన్ కొరకు దరఖాస్తు చేయడం
ప్రతి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఒక నిర్దిష్ట సంఖ్యలో డైరెక్టర్ల సమితి ఉండాలి. ప్రతి డైరెక్టరుకు ఒక డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్ (డిఐఎన్) ఇవ్వబడుతుంది. ఒక డైరెక్టర్ ఫార్మ్ డిఐఆర్ 3 ఫైల్ చేయవచ్చు లేదా ఫైలింగ్ SPICe+ ద్వారా జారీ చేయబడిన డిఐన్ పొందవచ్చు. డిఐఆర్ 3 లో డైరెక్టర్ పాన్ మరియు ఆధార్ కార్డ్ వివరాల వంటి ప్రాథమిక సమాచారము నింపవలసి ఉంటుంది. అయితే, SPICe+ ప్రక్రియ కింద, ముగ్గురు డైరెక్టర్లు డిఐఎన్ కొరకు దరఖాస్తు చేయవచ్చు. ఒకవేళ కంపెనీ ముగ్గురు కంటే ఎక్కువమంది డైరెక్టర్లను నియమించాలని అనుకుంటే, కంపెనీ రిజిస్ట్రేషన్ తరువాత నియమించాలి.
పేరు ఆమోదము
కంపెనీ డైరెక్టర్లకు వారి డిఐఎన్ లను జారీ చేసిన తరువాత, కంపెనీ తన పేరును రిజర్వ్ చేసుకోవాలి. కంపెనీ పేరును 'పేరు రిజిస్ట్రేషన్' సదుపాయము కింద SPICe+ యొక్క భాగము-A ద్వారా రిజర్వ్ చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా, కంపెనీ తన పేరును SPICe+ ఫార్మ్ యొక్క భాగము-A మరియు భాగము-B లను కలిపి ఫైల్ చేయడం ద్వారా రిజర్వ్ చేసుకోవచ్చు. అయితే, రెండు ఫార్మ్స్ ను కలిపి ఫైల్ చేసేటప్పుడు ఒకే పేరు దరఖాస్తు చేయవచ్చని గుర్తుంచుకోండి.
ఫార్మ్ SPICe+ (ఐఎన్సి-32)
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఫిబ్రవరి 23, 2020 నుండి SPICe+ ను ప్రవేశపెట్టింది. SPICe+ ఫార్మ్ యొక్క భాగము B పూర్తిగా డిజిటల్ అయినది మరియు సులభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియను అనుకూలపరుస్తుంది. పేరు ఆమోదించబడిన తరువాత, దరఖాస్తుదారుడు ఆమోదించబడిన పేరు యొక్క లింక్ పై క్లిక్ చేయాలి మరియు కంపెనీ రిజిస్ట్రేషన్ ను పూర్తి చేయాలి.
పిఏఎన్ మరియు టిఏఎన్
SPICe+ ఫైల్ చేసే సమయములో, మీరు కంపెనీ యొక్క పిఏఎన్ మరియు టిఏఎన్ కొరకు కూడా దరఖాస్తు చేయవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత, ఆన్లైన్ సిస్టమ్ ఆటోమాటిక్ గా ఈ ఫార్మ్స్ జనరేట్ చేస్తుంది. కంపెనీ యొక్క సర్టిఫికేట్ ఆఫ్ ఇంకార్పొరేషన్ తోపాటు, ఆదాయ పన్ను విభాగము కూడా పిఏఎన్ ను కేటాయిస్తుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుండి మీకు కంపెనీ యొక్క సర్టిఫికేట్ ఆఫ్ ఇంకార్పొరేషన్, పిఏఎన్ మరియు టిఏఎన్ ఉన్న ఒక ఈమెయిల్ అందుతుంది.
ముగింపు
వ్యాపారాన్ని చట్టబద్ధంగా నిర్వహించుటకు భారతీయ చట్టాల కింద ఒక కంపెనీని రిజిస్టర్ చేయడం తప్పనిసరి. ఇదివరకు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు మెమొరాండం ఆఫ్ అసోసియేషన్ మరియు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ను ఫైల్ చేయడం ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్దేశించింది. అయితే, SPICe+ ప్రవేశముతో, అన్ని ఫార్మ్స్ ఇప్పుడు SPICe+ వ్యవస్థకు అనుసంధానం చేయబడ్డాయి, తద్వారా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్ట్రేషన్ ను సులభంగా చేయవచ్చు. మీరు ఒక కంపెనీని స్థాపించిన తరువాత, మీరు వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించుటకు ప్రముఖ బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సిల నుండి ఋణాలు తీసుకోవచ్చు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications