వావ్.. బల్బులో మట్టి గణేశుడు.. మెదక్ వాసి అద్భుత ప్రతిభ

వినాయక చవితి సందర్భంగా కళాకారులు తమ కళను ప్రదర్శిస్తుంటారు. ఒక్కొక్కరు ఒకలా వినాయకుడి ప్రతిమను రూపొందిస్తారు. అలా మెదక్ జిల్లాకు చెందిన ఓ యుకుడు బల్బులో మట్టి విగ్రహాన్ని తయారు చేసి తన ప్రతిభను ప్రదర్శించాడు. అల్ల దుర్గం మండలం గడిపెద్దపూర్ గ్రామానికి చెందిన బచ్చలి మోహన్ అనే యువకుడు విద్యుత్ బల్బులో వినయక విగ్రహాన్ని తయారు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. వినాయక నవరాత్రి ఉత్సవాలు రావడంతో గత పదిరోజులుగా శ్రమించి ఈ అద్భుతం చేశానని తెలిపాడు.

గతంలో కూడా ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేశారు. అతను జిల్లా కలెక్టర్ ప్రశంసలు పొందాడు. ఇప్పుడు బల్బు లో విగ్రహం తయారు చేయడం చూసిన వారంతా మోహన్ కళను ప్రశంసించారు. శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు.

ఇటు ఖైరతాబాద్ మహా గణపతి సహా నగరంలో గల వేలాది విగ్రహాల నిమజ్జనం ఎక్కడా అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. నిమజ్జనానికి మరో కొద్దీరోజుల సమయం ఉండటంతో ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టింది. హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దనే తీర్పును అమలు చేయాల్సిందేనని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.

ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన గణపతి నిమజ్జనం హుస్సేన్‌ సాగర్‌లో జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఆ భారీ గణనాథుడిని ఎక్కడ నిమజ్జనం చేస్తారు? అక్కడి వరకు ఆ విగ్రహాన్ని ఎలా తరలిస్తారనే అంశం సస్పెన్స్‌గా మారింది. భాగ్యనగరంలో భారీ సంఖ్యలో మండపాలు ఏర్పాటు చేశారని, వాటిలో నెలకొల్పిన వేలాది విగ్రహాల నిమజ్జనానికి తగినన్ని నీటి కుంటలు అందుబాటులో లేవని ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఈ సారికి ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనానికి అనుమతించాలని.. లేకపోతే నిమజ్జనం పూర్తి కావడానికి ఆరు రోజుల సమయం పడుతుందని తెలిపిన సంగతి తెలిసిందే.

 a man made clay statue in bulb

బల్దియా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు బేబీ పాండ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. నగరంలోని 25 చెరువుల్లో ప్రత్యేక కొలనులు నిర్మిస్తోంది జీహెచ్‌ఎంసీ. కొలనులు తీసి నీరు నింపేందుకు ఇంకొన్ని రోజులు సమయం పట్టనుంది. దీనికి తోడు పెద్ద విగ్రహాల నిమజ్జనం బేబీ పాండ్స్‌లో కష్టమవనుంది. అందుకోసమే ఈ సారికి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును కోరింది. కానీ ససేమిరా అనడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+