మాములుగా లేదుగా.. చెట్టుపై బీటెక్ విద్యార్థి బస, పాజిటివ్ రావడంతో..
కరోనా వల్ల చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. వింత వింత అనుభవాలు కూడా వస్తున్నాయి. పాజిటివ్ వస్తే 14 రోజులు తప్పనిసరిగా ఐసోలేషన్‌లో ఉండాల్సిందేననే సంగతి తెలిసిందే. అయితే కొందరికీ ఇంట్లో వసతులు ఉండవు. అలాంటి వారికి ఇబ్బందులు తప్పవు. బయటకు వెళదామని అనుకున్న ఎవరూ ఆహ్వానించరు. కోవిడ్ కేర్ సెంటర్ ఉన్నా.. చాలా మట్టుకు నగదు పే చేయాల్సిందే. అయితే రెండు ఘటనలు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఒకతను బాత్రూంనే బెడ్ రూంగా మార్చివేశారు. మరొకరు చెట్టుపై బస ఏర్పాటు చేసుకున్నారు.

చెట్టుపై బస
నల్గొండ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కరోనా వైరస్ సోకిన ఓ బీటెక్ విద్యార్థి చెట్టుపై నివాసం ఏర్పరచుకున్నాడు. అడవిదేవులపల్లి మండలం కొత్త నందికొండ గ్రామానికి చెందిన రమావత్ శివానాయక్ ఇంజినీరింగ్ చేస్తున్నాడు. కరోనా వల్ల తరగతులు నిలిచిపోవడంతో గత కొన్నినెలలుగా గ్రామంలోనే ఉంటున్నాడు. కుటుంబసభ్యులతో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు వైరస్ సోకింది.

ధాన్యం విక్రయించిన తర్వాత..
ఇటీవలే శివనాయక్ స్థానిక ఐకేపీ కేంద్రంలో ధాన్యం విక్రయించాడు. ఆ తర్వాత జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతుండడంతో కరోనా టెస్టు చేయించగా, పాజిటివ్ వచ్చింది. తమ ఇంట్లో ఉన్నది ఒకే గది కావడంతో ఐసోలేషన్‌లో ఉండేందుకు తన ఇంటి సమీపంలోని చెట్టునే ఆవాసంగా మలుచుకున్నాడు. చెట్టుపై మంచాన్ని గట్టిగా తాళ్లతో కట్టి దానిపైనే విశ్రమిస్తూ ఐసోలేషన్‌లో గడుపుతున్నాడు. గత తొమ్మిది రోజులుగా ఇదే విధంగా చెట్టుపైనే శివానాయక్ మకాం ఉంటున్నాడు. దీనికి సంబంధించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.

ముమ్మాటికీ కరెక్టే
వాస్తవానికి శివనాయక్ చేస్తున్నది కరెక్ట్. వైరస్ గాలి ద్వారా కూడా సోకుతున్న ఈ తరుణంలో.. మంచి నిర్ణయమే తీసుకున్నారు. చాలా మంది అతను చేసిన పనిని ప్రశంసిస్తున్నారు. గెట్ వెల్ సూన్ అని కామెంట్స్ చేస్తున్నారు. వైరస్ జయించి.. చెట్ట మీద నుంచి కిందకి రావాలని ఆకాంక్షిస్తున్నారు.
Recommended Video
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications