హతవిధి.. ఆటోను ఢీ కొన్న లారీ.. వాగులో పడ్డ ఆటో.. గాయాలు..
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. సంగం వద్ ఓ లారీ.. ఆటోని ఢీకొట్టింది. లారీ వేగంగా ఢీకొట్టడంతో ఆటో బీరాపేరు వాగులో పడిపోయింది. ఆటోలో ఉన్న వారంతా వాగులో పడిపోయారు. ప్రమాద సమయంలో ఆటోలో 15 మంది వరకు ఉన్నారు. అక్కడున్న వారు చూశారు. వెంటనే సహాయ చర్యలు చేపట్టారు. అలా వారు స్పందించడంతో ప్రాణాలను కాపాడిన వారు అయ్యారు.
ఆటోలో ఉన్న వారు వాగు ఉధృతికి కొట్టుకుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు వాగులో కొట్టుకుపోతున్న వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేపట్టారు. పోలీసులు, స్థానికులు ఆరుగురిని కాపాడారు. ఓ చిన్నారి మాత్రం చనిపోయినట్టు తెలిసింది. ఆటో ఆత్మకూరు నుంచి సంగం వెళ్తుండగా ఈ దారుణం జరిగింది. ఆటోలోని వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారీగా తెలుస్తోంది. వాగులో కొట్టుకుపోయిన మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు.

మిగతా ఏడు నుంచి 8 మంది వరకు కొట్టుకుని పోయారు. ఆ సమయంలో వాగు ఉధృతిగా పారడం సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది. దీంతో వారి పరిస్థితి గురించి ఆందోళన నెలకొంది. చీకటి పడటంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలిగింది.












Click it and Unblock the Notifications