Diabetes: యువతలోనూ మధుమేహం.. ముందే జాగ్రత పడండి.. లేకుంటే అంతే..
షుగర్ ఒకప్పుడు అరుదుగా వచ్చే వ్యాధి. కానీ ఇప్పుడు ఈ మధుమేహం కామన్ అయిపోయింది. అయితే ఈ షుగర్ వృద్ధులకే కాదు యువతలో కూడా ఎక్కువగా వస్తుంది. సన్నగా ఉన్నా, కొవ్వు ఎక్కువగా తినకపోయినా, శారీరక శ్రమ ఎక్కువగా చేస్తున్నా కూడా రైతులు, కూలీలు, శ్రామికులకు కూడా షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు.

టైప్ 2
మధుమేహాన్ని గుర్తించడానికి శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. వాటిని అర్థంచేసుకోగలిగితే.. రోగం మరింత ముదిరి టైప్ 2 డయాబెటిస్‌కు దారితీయకుండా జాగ్రత్తపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఊబకాయం, కదలికలు లేని జీవిత విధానం తదితరాలు దీనికి కారణాలుగా చెబుతున్నారు.

కాలుష్యం
గాలి, నీరు, భూమి ఇలా అన్నీ కాలుష్యానికి గురికావడంతో మనుషులు రోగల బారిన పడుతున్నారు. రోగల్లో మధుమేహం ముందు ఉంది. శ్వాస, నీరు, ఆహారం ద్వారా ఒంట్లోకి చేరుకునే విషతుల్యాలన్నీ ప్రత్యక్షంగా క్లోమగ్రంథి నుంచి ఇన్సులిన్ తయారీని అడ్డుకుట్టాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్సులిన్ ప్రభావాన్ని తగ్గించే ఎడ్రినలిన్, థైరాక్సిన్, గ్రోత్ హార్మోన్ వంటి వాటినీ ఇవి ఉత్తేజితం చేస్తాయి. దీంతో షుగర్ వస్తుంది.

మూత్ర విసర్జన
నడి వయసు దాటిన వారిలో కనిపించే టైప్ 2 డయాబెటిస్ లక్షణాలే యువతరంలో వచ్చే మధుమేహంలోనూ కనిపిస్తాయట. అధిక దాహం, ఎక్కువసార్లు మూత్ర విసర్జన, అలసట, గాయాలు తొందరగా మానకపోవడం, పాదాల్లో తిమ్మిర్లు, మసకగా కనిపించడం.. చక్కెర వ్యాధికి తొలి సంకేతాలుగా వారు చెబుతున్నారు.

క్రిమి సంహారకాల ప్రమాదం
పంట పొలాల్లో క్రిమి సంహారక మందులు, ఎరువులు (ఆర్గనో ఫాస్ఫేట్, ఆర్గనో క్లోరిన్) మరో సమస్య. వీటిని చాలాకాలంగా చల్లుతున్న రైతులు, వ్యవసాయ కూలీల్లో టైప్ 2 మధుమేహం ఎక్కువగా కనిపిస్తోంది. ఇలా మధుమేహం బారినపడ్డవారిలో ఈ ఆర్గనో ఫాస్ఫేట్ మందుల అవశేషాలు పెద్ద మొత్తంలో ఉంటున్నట్టు గుర్తించారు.












Click it and Unblock the Notifications