వరసగా 3 సార్లు ఓడితే నో ఛాన్స్.. రెండుసార్లు పదవీ చేపట్టిన తర్వాత కూడా: నారా లోకేశ్

ఏపీలో అప్పుడే ఎన్నికల హీట్ నెలకొంది. వాస్తవానికి ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా సరే.. అధికార, విపక్షాలు మాత్రం ఎన్నికల హడావిడి చేస్తున్నాయి. ఒంగోలులో టీడీపీ మహానాడు నిర్వహిస్తోంది. తెలుగుదేశం పార్టీలో సంస్థాగతంగా సంచలన మార్పులు ఉండబోతున్నాయని తెలుస్తోంది. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా టీడీపీ నేత నారా లోకేశ్ ఈ మేరకు హింట్ ఇచ్చారు.

వరుసగా మూడు సార్లు ఓడిన వారికి ఇకపై టికెట్ ఇవ్వకూడదనే ఆలోచన చేస్తున్నామని ఉన్నట్టు లోకేశ్ తెలిపారు. ఇదివరకే పొలిట్ బ్యూరోలో ఈ విషయాన్ని చంద్రబాబు చెప్పారని లోకేశ్ గుర్తు చేశారు. పార్టీ పదవుల్లో ఇకపై 2+1 సిద్ధాంతం అమలుకు ప్రయత్నిస్తామన్నారు. రెండు సార్లు వరుసగా ఒకే పదవి చేపడితే ఆ తర్వాత పర్యాయం పదవీకి బ్రేక్ తీసుకోవాల్సిందే అని లోకేశ్ చెప్పారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా వచ్చేసారి తను బ్రేక్ తీసుకుంటానని లోకేశ్ వెల్లడించారు.

continuously 3 times defeat no ticket:nara lokesh

ఒకే వ్యక్తి ఏళ్ల తరబడి పార్టీ పదవుల్లో ఉంటే.. కొత్త రక్తం ఎలా వస్తుందని లోకేశ్ ప్రశ్నించారు. ఇది తన బలమైన కోరిక అని లోకేశ్ అన్నారు. పార్టీలో ఇప్పటికే ప్రతిపాదించామని మీడియా చిట్ చాట్‌లో తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే అభ్యర్ధుల ప్రకటన ఉంటుందని లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ లోగా కొంతమంది అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చేస్తామని స్పష్టంచేశారు.

30 నియోజకవర్గాల్లో నేతలు ఇప్పటికీ లైనులోకి రావడం లేదన్నారు. పని చేయని నేతలకు, ఇంచార్జ్ లకు అవకాశాలు ఉండవని నారా లోకేశ్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉండదని అంచనా వేశారు. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులు తిరిగి దండం పెడితే చాలు గెలిచే పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తమ పార్టీకి కలిసి వస్తోందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+