Crime News: కారులో తిప్పుతూ వివాహితపై అత్యాచారం.. గంటల వ్యవధిలో నిందితులను పట్టుకున్న పోలీసులు..
రంగారెడ్డి జిల్లా పీరం చెరువు అత్యాచారం కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు
రంగారెడ్జి జిల్లా పీరం చెరువు వద్ద వివాహితపై జరిగిన అత్యాచారం కేసులో పోలీసుల నిందితులను అరెస్ట్ చేశారు. పనులు ముగించుకొని ఇంటికెళ్తున్న మహిళను ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లాకు చెందిన దంపతులు గండిపేట మండలం బండ్లగూడజాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పీరంచెరువు ప్రాంతంలో రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నారు.

గేటెడ్ కమ్యూనిటీ
భర్త కూలీ పనులు చేస్తుండగా.. భార్య ఓ గేటెడ్ కమ్యూనిటీలో పని మనిషిగా పని చేస్తున్నారు. ఆమె రోజు గేటెడ్ కమ్యూనిటీలో పనులు చేసుకుని ఇంటికి వెళ్తోంది. శుక్రవారం బాధిత మహిళా పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. ఓ వ్యక్తి ఆమెతో మాట్లాడాడు. తమ వద్ద పని ఉందని ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. శనివారం ఉదయం ఆమెకు ఫోన్ చేసి పనికి రావాల్సిందిగా కోరగా.. తనకు గేటెడ్ కమ్యూనిటీలో పని ఉంది.. రాలేనని చెప్పారు.

బలవంతంగా కారులోకి ఎక్కించుకుని
బాధితురాలు గేటెడ్ కమ్యూనిటీకి పనికి వెళ్తుండగా.. బాచుపల్లికి చెందిన కారు డ్రైవర్ శుభం శర్మ , ప్రైవేటు ఉద్యోగి సుమిత్‌కుమార్ శర్మ కారులో ఆమెను అనుసరించారు. ఆమెతో మాట్లాడుతూ బలవంతంగా కారులోకి ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ను ఆమె చేత బలవంతంగా తాగించారు. బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లాక.. కారును తిప్పుతూ ఆమె అత్యాచారం చేశారు. అనంతరం ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడును లాక్కొని గండిపేట సమీపంలో వదిలేశారు.

గంటల వ్యవధిలో
స్పృహాలోకి వచ్చిన బాధితురాలు భర్తకు ఫోన్ చేయడంతో అతను వచ్చి భార్యను ఇంటికి తీసుకెళ్లాడు. బాధితురాలు జరిగిన విషయం భర్తతో చెప్పడంతో వారు నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను గంటల వ్యవధిలి పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications