పంజాబ్‌లో ర్యాగింగ్ భూతం..! తెలుగు విద్యార్థి బలి
శ్రీకాకుళం : పంజాబ్‌లో పడగవిప్పిన ర్యాగింగ్ భూతానికి తెలుగు విద్యార్థి బలయ్యాడు. ప్రైవేట్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ అభ్యసిస్తున్న సిక్కోలు బిడ్డ అర్ధాంతరంగా తనువు చాలించాడు. శ్రీకాకుళానికి చెందిన మనీష్ కుమార్ అక్కడి వర్సిటీలో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని చనిపోయాడు.
శ్రీకాకుళం శివారు ప్రాంతమైన కొత్త రోడ్డు చౌరస్తా సమీపంలో నివసించే గెంబలి రమేష్, గాయత్రి దంపతుల కుమారుడు మనీష్ కుమార్ పంజాబ్‌లోని లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. అయితే శుక్రవారం మధ్యాహ్నం తన స్నేహితుడికి వాయిస్ మేసేజ్ పంపించాడు. మీ అందరి వల్ల నేను ఇబ్బందిపడ్డాను అనేది దాని సారాంశంగా తెలుస్తోంది.

అనంతరం ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అదే రోజు రాత్రి మనీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని గుర్తించిన కళాశాల యాజమాన్యం అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. కుమారుడు చనిపోయాడనే విషయం తెలియగానే తల్లిదండ్రులు హుటాహుటిన పంజాబ్ కు వెళ్లారు. అక్కడి పరిస్థితులు చూసి ర్యాగింగ్ కారణంగానే తమ కుమారుడు చనిపోయాడని అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications