రణస్థలంలో పవన్ కల్యాణ్ రణన్నినాదం..!!
శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక బస్సు యాత్ర కోసం సన్నద్ధమౌతోన్నారు. త్వరలో ఆయన రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించనున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకుంటోన్నారు. ఇందులో భాగంగా వారాహి పేరుతో ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. హైదరాబాద్‌లో దీని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ఈ బస్సుయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.

విజయదశమి నాడే అనుకున్నా..
నిజానికి- ఈ ఏడాది అక్టోబర్‌లో విజయదశమి తరువాత పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాల్సి ఉంది. దీన్ని వాయిదా వేసుకున్నారాయన. జిల్లాలవారీగా నిర్వహిస్తోన్న జనసేన-జనవాణి కార్యక్రమాన్ని ముగించుకున్న తరువాత బస్సు యాత్రకు పూనుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. జనవాణి ద్వారా ప్రజల కష్టనష్టాలు తెలుస్తాయని, వాటిపై లోతుగా అధ్యయనం చేయడం- బస్సు యాత్రకు మరింత ఉపకరిస్తుందనేది జనసేన పార్టీ నేతల అభిప్రాయం.

యువ శక్తి పేరిట..
బస్సు యాత్ర కంటే ముందు పవన్ కల్యాణ్ మరో భారీ బహిరంగ సభకు శ్రీకారం చుట్టారు. ఆయన సారథ్యంలోని జనసేన పార్టీ- తాజాగా 'యువ శక్తి' పేరిట రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా- జనవరి 12వ తేదీన తొలి సభను నిర్వహించనుంది జనసేన పార్టీ. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో ఈ సభ ఏర్పాటు కానుంది. ఉదయం 11 గంటలకు సభ ఆరంభమౌతుంది. దీనికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు.

పోస్టర్ ఆవిష్కరణ..
యువ శక్తి పేరిట నిర్వహించనున్న బహిరంగ సభలకు సంబంధించిన పోస్టర్‌ను జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే యువ శక్తి పేరుతో ఈ సభలను నిర్వహించ తలపెట్టినట్టు ఆయన చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకట్లేదని ఆరోపించారు.

జనసేన-జనవాణితో..
నిజానికి- ఈ ఏడాది అక్టోబర్‌లో విజయదశమి తరువాత పవన్ కల్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టాల్సి ఉంది. దీన్ని వాయిదా వేసుకున్నారాయన. జిల్లాలవారీగా నిర్వహిస్తోన్న జనసేన-జనవాణి కార్యక్రమాన్ని ముగించుకున్న తరువాత బస్సు యాత్రకు పూనుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. జనవాణి ద్వారా ప్రజల కష్టనష్టాలు తెలుస్తాయని, వాటిపై లోతుగా అధ్యయనం చేయడం- బస్సు యాత్రకు మరింత ఉపకరిస్తుందనేది జనసేన పార్టీ నేతల అభిప్రాయం.

Click it and Unblock the Notifications