తెలంగాణలో కరోనా కల్లోలం: కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు, 1052 కరోనా వైరస్ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ కరోనావైరస్ విజృంభిస్తోంది. గత కొంతకాలంగా 200లకు లోపే కరోనా వైరస్ కేసులు నమోదవుతుండగా.. గత కొద్ది రోజులుగా భారీగా పెరిగాయి. గత ఏడాది జూన్ తర్వాత మొదటిసారి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1000 మార్క్ దాటడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి.

తెలంగాణలో కొత్తగా 1052 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1052 కరోనా కేసులు

తెలంగాణలో గత 24 గంటల్లో 42,991 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 1052 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,84,023కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ మంగళవారం సాయంత్రం బులిటెన్ విడుల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనా బారినపడి ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 4033కు చేరింది. సోమవారం 240 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 4858 యాక్టివ్ కేసులున్నాయి.

తెలంగాణలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు, మొత్తం 144

తెలంగాణలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు, మొత్తం 144

మరోవైపు తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 144కి చేరింది. సోమవారం ఎట్ రిస్క్, నాన్ రిస్క్ దేవాల నుంచి 127 మంది శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ కోవిడ్ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగా.. 8 మంది ప్రయాణికులకు పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు.

విదేశాల నుంచి 13,405 ప్రయాణికులు

విదేశాల నుంచి 13,405 ప్రయాణికులు

కాగా, ఇప్పటి వరకు రాష్ట్రానికి ఎట్ రిస్క్, నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 13,405 మంది ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయంలో కోవిడ్ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. వారిలో 189 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. వారందరి నమూనాలను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపించారు. వారిలో 45 మందికి ఒమిక్రాన్ నెగిటివ్ అని తేలింది. మిగిలిన 144 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చికిత్స అనంతరం ఒమిక్రాన్ బాధితుల్లో 37 మంది కోలుకున్నారు. మరో 50 మంది ఫలితాలు రావాల్ిస ఉందని అధికారులు తెలిపారు. కాగా, జనవరి 3 నుంచి రాష్ట్రంలో 15-18 ఏళ్ల వయస్సు పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదటి డోసు 100 శాతం పూర్తయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+