దివ్యాంగులకు కేసీఆర్ సర్కారు గుడ్‌న్యూస్: 5 శాతం రిజర్వేషన్
హైదరాబాద్: తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే రూ.3లక్షలు అందించనున్న విషయం తెలిసిందే. ఇందు కోసం గృహలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చిన వచ్చింది ప్రభుత్వం. ఈ పథకంలో దివ్యాంగులకు ఐదుశాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల రాష్ట్ర దివ్యాంగులాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి సీఎం కేసీఆర్‌కు కలిసి విజ్ఞప్తి చేయగా.. ఈ మేరకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో రోడ్లు భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అడిగిన వెంటనే సానుకూలంగా స్పందించారని, ఆయనకు దివ్యాంగుల సమాజం రుణపడి ఉంటుందన్నారు.

రాష్ట్రంలో దివ్యాంగులు సంతోషంగా ఉన్నారని, సొంతింటి కల నెరవేరినట్లుగా భావిస్తున్నారన్నారు. దివ్యాంగుల్లో ఆత్మగౌరవం, విశ్వాసం పెరిగిందన్నారు. మరోవైపు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకునే పేదల కోసం గృహలక్ష్మి పథకంలో భాగంగా రూ.3లక్షల ఆర్థిక సాయం అందించనుంది. ఈ మేరకు బడ్జెట్‌లో నిధులు సైతం కేటాయించింది.
గృహలక్ష్మి పథకం కింద 4లక్షల మందికి ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించింది.
ఈ నాలుగు లక్షల్లో ఒక్కో నియోజకవర్గానికి 3వేల చొప్పున 119 నియోజకవర్గాల్లో ఇండ్లు నిర్మించనుండగా.. మరో 43వేల ఇండ్లు రాష్ట్ర కోటాలో అనుమతి ఇవ్వనున్నారు. పథకం కింద లబ్ధిదారులకు రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని మూడు దఫాలుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకానికి రూ.12వేలకోట్లు ఖర్చవుతాయని అంచనా వేసిన ప్రభుత్వం.. ఈ మేరకు బడ్జెట్‌ను నిధులను కూడా కేటాయించింది. పథకానికి సంబంధించిన మార్గదర్శకాల్లో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10, బీసీ, మైనారిటీలకు 50శాతం రిజర్వేషన్‌ను అమలుచేయాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications