హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో కొత్తగా 682 కరోనా కేసులు.. మరో ముగ్గురు మృతి...

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో కొత్తగా 682 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. మరో 812 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం (డిసెంబర్ 8) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,74,540కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1477కి చేరింది. ప్రస్తుతం 7,696 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. మరో 5634 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 761 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,65,317కి చేరింది.

682 new coronavirus cases and 3 deaths reported from telangana

గడిచిన 24గంటల్లో మొత్తం 45,021 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 58,68,233కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 1,57,663 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.5శాతం ఉండగా... తెలంగాణలో 0.53శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 94.6శాతం ఉండగా తెలంగాణలో 96.65శాతం ఉన్నట్లు తెలిపారు.

తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 119, రంగారెడ్డి జిల్లాలో 47 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం(డిసెంబర్ 7) రాష్ట్రంలో 517 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

English summary
682 new coronavirus cases were reported in Telangana from last 24 hours,more 3 patients were died. Total cases number reached to 2,74,540 and total death toll reached to 1477.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X