80 శాతం ఎక్సైజ్ సిబ్బందిపై కేసులు, సీమాంధ్ర పాలకుల పనే: పద్మారావు

హైదరాబాద్: తెలంగాణలోని 80 శాతం ఎక్సైజ్ సిబ్బంది అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) కేసులు ఎదుర్కుంటున్నారని ఆబ్కారీ శాఖ మంత్రి పద్మారావు చెప్పారు. సోమవారం సచివాలయంలో ఆబ్కారీ శాఖ 2016 డైరీని ఆవిష్కరించిన తర్వాత ఆయన ప్రసంగించారు.

గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పాలకులు ఆబ్కారీ శాఖ ఉద్యోగులపై ఎసిబి కేసులు బనాయించారని తనకు ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పారని, అందువల్ల వాటిని ఉపసంహరిస్తామని మంత్రి చెప్పారు. ఆ మాట చెప్పగానే ఉద్యోగ సంఘాల నాయకులు కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేసారు.

80 per cent excise staff face ACB cases: Padma Rao

సమావేశంలో ఉన్న టిఎన్జీవో సంఘం నాయకుడు జి. దేవీప్రసాద్, కె. రవీందర్ రెడ్డి, ఉద్యోగులు మంత్రి హామీకి హర్షధ్వానాలు చేశారు. 325 మంది ఉద్యోగులను రెడ్ హ్యాండెడ్‌గా ఎసిబి అధికారులు పట్టుకున్నట్లు తెలుస్తోంది.

అయితే, లంచం తీసుకుంటుండగా ఎంత మంది ఉద్యోగులను ఎసిబి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందనే విషయాన్ని వారు వెల్లడించారు. అయితే, తెలంగాణ భావోద్వేగం కారణంగా ఆ కేసులను ఉపసంహరించుకుంటే చట్టబద్దమవుతుందా, కాదా అనేది తేలాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+