25న నా పెళ్లి ఉంది.. నేను జైలుకు వెళ్లను: కోర్టులో నిందితుడు వీరంగం
హైదరాబాద్: గంజాయి కేసులో అరెస్టైన ఓ నిందితుడు కోర్టులో వీరంగం సృష్టించాడు. జూన్ 25న తన పెళ్లి ఉందని, జైలుకు వెళ్లనంటూ హల్చల్ చేశాడు. కోర్టు లోపల డోర్‌కు ఉన్న అద్దాలు పగలగొట్టడంతో నిందితుడి చేతికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం నాంపల్లి కోర్టులో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నిందితుడు ఆనంద్ అగర్వాల్ రౌడీ షీటర్. ఇప్పటికే అతనిపై 18 కేసులు నమోదయ్యాయి. ఇటీవల గంజాయి కేసులో శాలిబండ పోలీసులు అగర్వాల్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసు విచారణ సందర్భంగా అతనికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో తనకు పెళ్లి కుదిరిందని.. జైలుకు వెళ్లనని మొండికేశాడు.

అంతటితో ఆగకుండా కోర్టు లోపల డోర్ అద్దాలు ధ్వంసం చేశాడు. నిందితుడు అగర్వాల్‌పై గతంలోనూ పలు గంజాయి కేసులు నమోదయ్యాయి. ఓ మర్డర్ కేసు, దొంగతనం కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు. నెల రోజుల క్రితమే ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి విడుదల కావడం గమనార్హం.
ప్రేమ వ్యవహారం: కృష్ణా నదిలో దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతన్న విద్యార్థి గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మోతే మండలం మాజీ ఎంపీపీ కుమారుడు లోకేశ్ మే నెల 29న తాను ఇక కనిపించనని తల్లిదండ్రులకు సమాచారాన్నిచ్చి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అతడి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. హైదరాబాద్ సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న లోకేశ్.. అదే కళాశాలకు చెందిన యువతిని ప్రేమించాడు. కాలేజీలో యువతి ప్రేమ వ్యవహారం వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతని బంధువులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications