బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లోథాపై శనివారం కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. మంగళ్‌హాట్ పరిధిలోని బాలరాంగల్లీలో శుక్రవారం రాత్రి ఓ పెళ్లి జరిగింది.
వివాహ కార్యక్రమం అనంతరం బారాత్ సందర్భంగా డీజే సౌండ్ ఎక్కువగా పెట్టడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఓ పోలీస్ కానిస్టేబుల్ అక్కడికి వెళ్లి డీజేను ఆపేందుకు ప్రయత్నించాడు.
ఆ పెళ్లికి హాజరైన ఎమ్మెల్యే రాజాసింగ్ డీజేను నిలిపేసినందుకు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కానిస్టేబుల్‌పై చేయిచేసుకున్నందుకు ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మాజీ మేయర్‌పై కేసు నమోదు
గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్‌పై హుమాయున్‌నగర్ ఠాణాలో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనపై దాడి చేశారని మాజీ మేయర్ గన్‌మెన్ మోబిన్ ఫిర్యాదుతో గత ఏప్రిల్ 5న స్థానికంగా ఉండే బాబర్, వాహేబ్, మక్బూల్‌పై హుమాయున్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు.
కాగా, మాజీద్ హుస్సేన్, మోబిన్, మజ్లిస్ నేత సాదిఖ్ ఇంటికి వచ్చి నానా దుర్భాషలాడారని, తీవ్రంగా కొట్టారని బాబర్ తదితరులు ఏప్రిల్ 23న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications