కంగనా రనౌత్ పై కేసు నమోదు.!ఇంతజరిగినా బుద్దిరాలేదన్న వీహెచ్.!

హైదరాబాద్ : బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి. హనుమంత రావు మండిపడ్డారు. సంబందంలేని అంశాలను ప్రస్తావిస్తూ రాజకీయ గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలపైన అనేక ఆరోపణలు చేస్తున్నారని, మహిళ సీఆర్పీఎఫ్ అధికారి చెంప దెబ్బ కొట్టినా కూడా తనలో మార్పు రాలేదన్నారు వీహెచ్.

లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి డ్రగ్స్ అలవాటు ఉందనే ఆరోపణలు చేయడం సమంజసం కాదని, ఆయన చెత్త ప్రసంగాలు చేస్తాడని కామెంట్ చేయడం పట్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు విహెచ్. కంగనా మీద హైదరాబాద్ లోని అంబర్ పేట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామని, ఈ లాంటి వాళ్ళను బీజేపీ ప్రోత్సహిస్తే ప్రజలు తిరగబడి తరిమికొడతారన్నారు వీహెచ్.

A case has been registered against Kangana Ranaut

కంగనా రనౌత్ ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పార్టీ అద్యక్షుడు జేపీ నడ్డా మీద ఉందన్నారు వీహెచ్. కంగనా మీద చర్యలు తీసుకుంటే నైతిక విలువలు కాపాడబడతాయని, తాను చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేసారు. అంతే కాకుండా కంగనా మీద కేసులు నమోదు చేయాలని డీజీపీ, కమిషనర్ లకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

రంగనాథ్ మంచి పనిచేస్తున్నారు కాబట్టి తనను అప్రిషేట్ చేస్తున్నానన్నారు వీహెచ్. పేదల ఇండ్లు కూల్చితే.. డబుల్ బెడ్ రూం ఇండ్లు వాళ్లకు ఇవ్వాలని, అంబర్ పేట లోని ముస్లిం స్మశాన వాటికలో కూడా ఇండ్ల నిర్మాణం చేస్తున్నారని, దీని మీద కూడా చర్యలు తీసుకోవాలన్నారు విహెచ్. పార్టీలకు అతీతంగా ప్రజల వైపు నిలబడాలని.. కుటుంబ సభ్యులు అక్రమ నిర్మాణం చేపట్టినా కూల్చేస్తామని సీఎం ప్రకటన చేశారని ఇది స్వాగతించాల్సిన అంశమన్నారు వీహెచ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+