అందరూ చూస్తుండగా... ఆరుబయట.. ఎస్సైపై కానిస్టేబుల్ దాడి
కానిస్టేబుల్ శ్రీనివాసుకు, ఎస్సై తిరుపతికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే ఆ కానిస్టేబుల్ నెట్టివేయడంతో ఎస్సై తిరుపతి తూలి కిందపడ్డాడు.
కొత్తగూడెం: ఓ ఎస్సైపై, కానిస్టేబుల్ దాడి చేశాడు. గాయపరిచాడు. అసలేం జరిగిందంటే...
టేకులపల్లి మండలం శాంతినగర్ ప్రాంతానికి చెందిన సీఆర్ పీఎఫ్ కానిస్టేబుల్ గుగులోతు శ్రీనివాస్, తన భార్యతో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాయించేందుకని ఆదివారం కొత్తగూడంలోని సెయింట్ మేరీస్ పాఠశాల కేంద్రానికి వచ్చాడు.
ఆమెను లోనికి పంపించి, తన బిడ్డను ఎత్తుకుని బయట నిలుచున్నాడు. 9.10 గంటలకే పరీక్ష కేంద్రం నిర్వాహకులు గేటు మూసివేశారు. ఆ తరువాత వచ్చిన కొందరు అభ్యర్థులు, గేటును తోసుకుని లోపలికి వెళ్లిపోయారు. ఈ కేంద్రం వద్దకు వచ్చిన ఎస్సై తిరుపతి, పరీక్ష కేంద్రం వద్దనున్న అభ్యర్థులను.. వారి సంబంధీకులను అక్కడి నుంచి బయటకు పంపిస్తున్నారు.

ఈ క్రమంలోనే కానిస్టేబుల్ శ్రీనివాసుకు, ఎస్సై తిరుపతికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే ఆ కానిస్టేబుల్ నెట్టివేయడంతో ఎస్సై తిరుపతి తూలి కిందపడ్డాడు. ఎడమ చేతికి, కుడి కాలికి స్వల్ప గాయాలయ్యాయి.
శ్రీనివాసును ఆ ఎస్సై వెంటనే అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషనుకు తరలించారు. తన విధి నిర్వహణను ఆటంకపరిచినందుకుగాను 332 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications