హైదరాబాద్ బిల్డర్ దారుణ హత్య, రాత్రి భార్యకు ఫోన్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే ?
హైదరాబాద్ లో అతను ఓ ప్రముఖ బిల్డర్. ట్రావెల్స్ వ్యాపారమూ ఉంది వ్యాపారం పనినిమిత్తం నిత్యం బయట తిరుగుతున్న అతని వెంట స్నేహితులు ఉన్నారు. వ్యాపారం పనిమీద పొరుగు రాష్ట్రానికి వెళ్లాడు. బిల్డర్ కు తోడుగా అతని స్నేహితులు వెళ్లారు. భార్యకు ఫోన్ చేసిన వ్యక్తి తాను హైదరాబాద్ బయలుదేరాను అని చెప్పాడు. తరువాత ఆ బిల్డర్ తల మీద బండరాళ్లు వేసి, కత్తులతో పొడిచి అతన్ని అతి కిరాతంగా హత్య చెయ్యడం రెండు రాష్ట్రాల్లో కలకలం రేపింది.
హైదరాబాద్ లోని జీడిమెట్లలోని కల్పన సొసైటీ ప్రాంతంలో కుప్పాల మధు అలియాస్ మధు (48) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మధు బిల్డర్ గా పని చేస్తున్నాడు. మధుకు ట్రావెల్స్ వ్యాపారమూ ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. మధుకు భార్య వెంకటలక్ష్మి, కుమార్తెలు అలేఖ్య, అఖిల ఉన్నారు. భార్య, పిల్లలతో కలిసి సంతోషంగా ఉంటున్న మధు నిత్యం వ్యాపారం పనిమీద బయట తిరుగుతున్నాడు.

వ్యాపారం పనిమీద మధు ఎక్కువగా కర్ణాటకలోని బీదర్ కు వెళ్లేవాడని తెలిసింది. ఈనెల 24వ తేదీన మధు బీదర్ కు బయలుదేరాడు. కారు డ్రైవింగ్ చెయ్యడానికి తోడుగా చింతల్ ప్రాంతానికి చెందిన రేణుక ప్రసాద్, లిఖిత్ సిద్దార్థ్ రెడ్డి, వరుణ్ అనే ముగ్గురిని వెంటపిలుచుకుని కర్ణాటకలోని బీదర్ వెళ్లాడు. రాత్రి 10 గంటలకు భార్య వెంకటలక్ష్మికి ఫోన్ చేసిన మధు నేను హైదరాబాద్ కు బయలుదేరుతున్నానని చెప్పాడు.
అదే రోజు గంట తరువాత వెంకటలక్ష్మి ఆమె భర్త మధుకు ఫోన్ చేసింది. అయితే మధు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె భయపడిపోయింది. మరుసటి రోజు తెల్లవారి జామున వరకు కూడా మధు ఇంటికి రాకపోవడంతో బయపడిపోయిన వెంకటలక్ష్మి బంధువులకు ఫోన్ చేసింది. బీదర్ జిల్లాలోని మన్నేకెళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 25వ తేదీన ఉదయం రోడ్డు పక్కన నిలిపివున్న కారు దగ్గర మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కారు నెంబర్ ఆదారంగా ఆమృతదేహం హైదరాబాద్ కు చెందిన మధు అనే వ్యక్తిది అని గుర్తించిన బీదర్ జిల్లా పోలీసులు వెంటనే జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. జీడిమెట్ల పోలీసులు మధు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బిల్డర్ మధును అతికిరాతకంగా హత్య చేశారని వెలుగు చూడటంతో అతని కుటుంబ సభ్యులు హడలిపోయారు.
మధు తలపై పెద్దబండరాయితో దాడి చేసి తరువాత అతన్ని కత్తులతో పొడిచి చంపేశారని మన్నేకెళ్లిపోలీసులు తెలిపారు. బిల్డర్ ను హత్య చేసిన నిందితులు అతని శరీరం మీద ఉన్న రూ. 6 లక్షల విలువైన బంగారు నగలు, వ్యాపారం నిమిత్తం వెంట తీసుకెళ్లిన భారీ మొత్తంలోని నగదు ఎత్తుకెళ్లారని అతని భార్య వెంకటలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధు వెంటవెళ్లిన రేణుక ప్రసాద్, లిఖిత్ సిద్దార్థ్ రెడ్డి, వరుణ్ అనే ముగ్గురే హత్య చేసి ఉంటారని, వారి కోసం గాలిస్తున్నామని మన్నేకెళ్లి పోలీసులు, హైదరాబాద్ లోని జీడిమెట్ల పోలీసులు తెలిపారు. బీదర్ జిల్లాలో బిల్డర్ మధు హత్యకు గురికావడంతో హైదరాబాద్ లోని సాటి బిల్డర్లు షాక్ అయ్యారు.
-
మూసీ తీరాన మహత్తరం -
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications