ఫేస్‌బుక్ పెళ్లి: ముంబై అమ్మాయి, ములుగు అబ్బాయి
వరంగల్/ముంబై: వరంగల్ జిల్లా ములుగు పట్టణానికి చెందిన ఇనుముల రామస్వామి, సుగుణ దంపతుల కుమారుడు కిరణ్‌కి, మహారాష్ట్రలోని ముంబైలో ఉండే యువతి సరస్వతికి బుధవారం వివాహం జరిగింది. కాగా, వారి పరిచయం సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ ద్వారా జరగడం విశేషం.
రెండేళ్ల క్రితం(2013) వీరిద్దరికి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది. ఆ పరిచయం పెరిగి స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. దీంతో వారు ఇరువురు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

వెంటనే వారిరువురి తల్లిదండ్రులను సంప్రదించి ఒప్పించారు. ఇరువురి పెద్దల అంగీకారంతో వారి ఫేస్‌బుక్ ప్రేమ పెళ్లి పీటలెక్కింది. బుధవారం ములుగులోని ఓ చర్చిలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. ఈ వేడుకకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, జడ్పీ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్, తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.












Click it and Unblock the Notifications