ఫ్రెండ్ భార్య అని కూడా చూడకుండా.. గ్యాంప్‌రేప్ చేశారు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నేహితుడి భార్య అని కూడా చూడకుండా, ఇంట్లో ఒంటరిగా ఉన్న అతని భార్యపై సామూహిక అత్యాచారం చేశారు దుర్మార్గులు. అంతేగాక, ఈ విషయం బయటికి చెప్పితే చంపేస్తామని బెదిరించారు. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలోని పాత శివాలయం వెనుక ఉన్న ఓ అపార్టుమెంటులో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న వ్యక్తి స్నేహితులు అహ్మద్(42), రాజయ్య(43)లు. అయితే, ఆ వాచ్‌మన్‌ను కలవడానికి అతడు పనిచేస్తున్న అపార్టుమెంటు వద్దకు వెళ్లారు ఈ ఇద్దరు.

A man's wife gangraped by his friends

ఆ సమయంలో అతడు ఇంట్లో లేడు. అతడి భార్య ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన అహ్మద్, రాజయ్యలు.. ఇంట్లోకి చొరబడి ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారు.

ఆ తర్వాత ఈ విషయాన్ని బయటకి చెబితే చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, జరిగిన విషయాన్ని సదరు మహిళ తన భర్తతో చెప్పి కూకట్‌పల్లి పోలీసులకు ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man's wife gangraped by his friends in Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి