crime News: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. కారులో తిప్పుతూ వివాహితపై అత్యాచారం..
రంగారెడ్డి జిల్లాలో వివాహితను కిడ్నాప్ చేసి కారులోనే అత్యాచారం చేశారు.
వివాహితను కిడ్నాప్ చేసి కారులో తిప్పుతూ లైంగిక దాడికి పాల్పడిన ఘటన రంగారెడ్జి జిల్లా పీరం చెరువు వద్ద జరిగింది. మహిళతో బలవంతంగా మద్యం తాగించిన దుండగులు.. ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఆమె వద్ద బంగారం దోచుకుని గండిపేట వద్ద వదిలిపెట్టి పరారయ్యారు. బాధితురాలు భర్త సహాయంతో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు.
వివాహితను బలవంతంగా కారులో ఎక్కించుకొని కిస్మత్ పూర్ వైపు తీసుకెళ్లారు.కారును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె వద్ద ఉన్న మొబైల్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేశారు. ఆమెను బలవంతంగా మద్యం తాగాలని అనడంతో ఆమె ఒప్పుకోలేదు దీంతో దుండగులు నోరు పట్టుకుని మద్యం తాగించారు. ఆ తర్వాత ఆమెపై ఒకరి తరువాత మరొకరు ఆత్యాచారానికి పాల్పడ్డాట్టు తెలిసింది.













Click it and Unblock the Notifications