పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు: మీడియాపై దూషణలే కారణం!
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పవన్ అభిమానులు టీవీ9 కార్యాలయానికి ఫోన్ చేసి ఆ ఛానల్ సీఈవో రవి ప్రకాశ్‌ను ఉద్దేశించి ఇష్టానుసారంగా దూషిస్తున్నారంటూ ఏప్రిల్ 21న పాత్రికేయ సంఘాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాయి.
Recommended Video

ఈ సందర్భంగా పవన్ తన ట్విట్టర్‌లో పెట్టిన కామెంట్లు, మీడియా కథనాలను వక్రీకరించి అప్‌లోడ్‌చేసిన దృశ్యాలను వారు పోలీసులకు అందజేశారు. రవిప్రకాశ్‌తో పాటు ఇతర ఉద్యోగులను దూషించిన ఆడియోలను కూడా సమర్పించారు.

ఈ ఆధారాలను పరిశీలించిన పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ప్రాథమిక ఆధారాలతో పవన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.
కాగా, గత కొద్ది రోజులుగా కొన్ని మీడియా సంస్థలను ఉద్దేశించి పవన్ ట్విట్టర్ వేదిక విమర్శలు చేస్తున్న విషయం విధితమే. తన తల్లిని ఓ నటి దూషించిన వీడియో క్లిప్పును పదే పదే చూపడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications