Telangana: ఫొటోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులు.. బీటేక్ విద్యార్థిని ఆత్మహత్య..

పర్సనల్ ఫొటోలు సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయల్ చేయడంతో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

పిల్లలను చదుకోమ్మని కళాశాలలకు పంపిస్తుంటే.. వారు చేసే పనులు తల్లిదండ్రులకు తీవ్ర క్షోభను మిగులుస్తున్నాయి. ఓ అమ్మాయి కోసం స్నేహితుడిని అత్యంత దారుణంగా హత్య చేసి.. అవయవాలను బయటకు తీసిన హరిహరకృష్ణ ఉదంతం అందరిని భయాందోళనకు గురి చేస్తోంది. చదువుకునే వయస్సులో ప్రేమ అంటూ వారు తీసుకునే నిర్ణయం చాలా జీవితాల్లో శోకాన్ని మిగుల్చుతున్నాయి. హరిహరకృష్ణ, నవీన్ ఘటన మరవకముందే వరంగల్ జిల్లాలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.

ఆ యువతి ప్రేమికుడితో దిగిన ఫొటోలను మరో యువకుడి ఫోన్ లోకి వెళ్లడం.. ప్రియుడు, యువకుడు ఇద్దరూ కలిసి బ్లాక్‌మెయిల్‌ చేయడంతో యువతి ఆదివారం బలవన్మరనానికి పాల్పడింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన రక్షిత వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలోని ముగ్ధుంపురం శివారులో ఉన్న ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ (ఈసీఈ) మూడో సంవత్సరం చదువుతోంది. ఈ నెల 22న తన కుమార్తె కనించడం లేదనిరక్షిత తండ్రి శంకరాచారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

A student committed suicide after blackmailing her about posting her personal photos on social media

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా రక్షిత ఆచూకీని కనుగొన్నారు. ఏ జరిగిందని పోలీసులు ప్రశ్నించగా.. ప్రేమికుడితో దిగిన ఫొటోలు అతను మరో వ్యక్తికి పంపాడు.. ఇద్దరు కలిసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు ఇద్దరినీ పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే రక్షితకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

రక్షిత ఆదివారం వరంగల్‌లోని తమ బంధువుల ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. రక్షితపై ర్యాగింగ్ పాల్పడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో కాలేజీ యాజమాన్యం స్పందించింది.

పబ్బోజు రక్షిత అనే విద్యార్థిని తమ కళాశాలలోనే ఈసీఈ విభాగంలో అడ్మిషన్‌ పొందిందని తెలిపింది. రెండేళ్లు కళాశాలలోనే చదివిందని.. కానీ బ్యాక్‌లాగ్‌లు ఎక్కువగా ఉండడంతో మూడో సంవత్సరంలో డిటెండ్‌ అయిందని పేర్కొంది. రక్షిత ఆరు నెలలుగా కళాశాలకు రావడం లేదని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+