వివాహేతర సంబంధముందని ప్రచారం: టెక్కీ అరెస్ట్
హైదరాబాద్: తన భార్యకు వివాహేతర సంబంధం ఉందని అసత్య ప్రచారం చేస్తున్న ఓ శాడిస్టు భర్తను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. సైదాబాద్‌కు చెందిన ఎస్ ప్రవీణ్ (47) సాప్ట్‌వేర్ ఇంజినీర్. అతనికి భార్య (45), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అంతా అమెరికాలో స్థిరపడ్డారు.
కాగా, రెండేళ్లుగా విభేదాలు తలెత్తడంతో భార్య పిల్లల నుంచి ప్రవీణ్ దూరంగా ఉంటున్నాడు. విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉండగా, భార్యపై కక్ష పెంచుకున్న ప్రవీణ్.. ఆమెకు బెదిరిస్తూ ఈ-మెయిల్స్ పంపడంతో పాటు ఆమెకు వివాహేతర సంబంధం ఉందని బంధువులు, కుటుంబసభ్యులకు ఎస్‌ఎంఎస్‌లు, మెయిల్స్ పంపాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు, నిందితుడిని బుధవారం అరెస్ట్ చేశారు.

తండ్రిని నరికి చంపిన తనయుడు
ఆదిలాబాద్ జిల్లాలోని దహేగామ్ మండలం పెసరకుంటలో దారుణం జరిగింది. మద్యం మత్తులో తండ్రిని గొడ్డలితో నరికి చంపాడు తనయుడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
డిజి కేబుల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
వరంగల్: హన్మకొండలోని డిజి కేబుల్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదంలో కంప్యూటర్లు, డికోడర్లు, మాడ్యులేటర్లు, ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications