అనుమానాస్పదం: అమెరికాలో తెలుగు యువకుడు మృతి
న్యూయార్క్/హైదరాబాద్: అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌కు చెందిన రవితేజారెడ్డి స్విమ్మింగ్ చేస్తూ మృతి చెందినట్లు శుక్రవారం అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో రవితేజా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
రవితేజారెడ్డి అమెరికాలోని అక్రాన్ స్టార్‌స్పేస్ యూనివర్శిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న రవితేజా మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రెండు నెలల క్రితమే ఉన్నత విద్య కోసం రవితేజా అమెరికా వెళ్లాడని వారు తెలిపారు.
ఉన్నత విద్య చదవి తమకు భవిష్యత్ అవుతాడనుకున్న కొడుకు గురించి, ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

శంషాబాద్‌లో 625 గ్రాముల బంగారం పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తీసుకువచ్చిన 625 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు.
ముంబైకి చెందిన దంపతులు సింగపూర్ నుంచి నగరానికి వచ్చారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు ఈ దంపతుల వద్ద నుంచి బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకుని, విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications