వరకట్న వేధింపులు: పెళ్లైన 7నెలలకే వివాహిత ఆత్మహత్య(పిక్చర్స్)

హైదరాబాద్: వరకట్న వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన నగరంలోని సరూర్‌నగర్ శివపురిలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం.. శివపురికాలలోని నివసించే రంజిత్ గౌడ్, వర్ష(25) దంపతులు. ఏడు నెలల క్రితం వీరికి వివాహమైంది. రైల్వేలో జూనియర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న రంజిత్ గౌడ్ వృత్తిరీత్యా వరంగల్ జిల్లా కాజిపేటలోనే భార్యతో కలిసి ఉంటున్నాడు. వీరిద్దరూ స్నేహితులైన మరో దంపతులతో కలిసి విహారం కోసం ఇటీవల గోవా యాత్రకు వెళ్లారు.

సోమవారం ఉదయం 6గంటలకు సరూర్‌నగర్ శివపురికాలనీలోని సొంతింటికి చేరుకున్నారు. మరో గంటలోనే వర్ష తన బెడ్ రూం తలుపులు మూసుకుని చున్నీతో ఉరేసుకుంది. కిటికీలోంచి చూసిన కుటుంబసభ్యులు తలుపు పగులగొట్టి ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వర్ష మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

కొంతకాలంగా అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించడం వల్లే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందంటూ ఆమె తండ్రి ఈశ్వరయ్య ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భర్త రంజిత్, మామ రంగయ్య, అత్త జయమ్మ, బావ రాజేష్, తోటి కోడలు స్వప్నలను నిందితులుగా చేర్చారు. కాగా, ఘటనా స్థలంలో కేవలం ‘సారీ' అని ఆంగ్లంలో రాసి ఉన్న సూసైడ్ నోట్ లభించినట్లు పోలీసులు తెలిపారు.

భర్తతో వర్ష(ఫైల్)

భర్తతో వర్ష(ఫైల్)

వరకట్న వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన నగరంలోని సరూర్‌నగర్ శివపురిలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నివాసం

నివాసం

ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం.. శివపురికాలలోని నివసించే రంజిత్ గౌడ్, వర్ష(25) దంపతులు. ఏడు నెలల క్రితం వీరికి వివాహమైంది.

వర్ష ఆత్మహత్య

వర్ష ఆత్మహత్య

రైల్వేలో జూనియర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న రంజిత్ గౌడ్ వృత్తిరీత్యా వరంగల్ జిల్లా కాజిపేటలోనే భార్యతో కలిసి ఉంటున్నాడు. వీరిద్దరూ స్నేహితులైన మరో దంపతులతో కలిసి విహారం కోసం ఇటీవల గోవా యాత్రకు వెళ్లారు.

వర్ష ఆత్మహత్య

వర్ష ఆత్మహత్య

సోమవారం ఉదయం 6గంటలకు సరూర్‌నగర్ శివపురికాలనీలోని సొంతింటికి చేరుకున్నారు. మరో గంటలోనే వర్ష తన బెడ్ రూం తలుపులు మూసుకుని చున్నీతో ఉరేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+