మోహన్ బాబు ఫ్యామిలీ గొడవల్లో కొత్త ట్విస్ట్..

Mohan Babu: ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు కుటుంబంలో చెలరేగిన వివాదాలు, ఆస్తిపరమైన గొడవలకూ బ్రేకులు పడట్లేదు. తెలంగాణలో మొదలైన ఈ ఘర్షణలు.. ఏపీ వరకూ పాకాయి. మంచు కుటుంబం సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

సంక్రాంతి పండగ వేడుకలను జరుపుకోవడానికి సొంత జిల్లాకు వచ్చారు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు, ఇతర కుటుంబ సభ్యులు. ఆస్తి తగాదాల నేపథ్యంలో మంచు మనోజ్ ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు. పెద్దల సమాధిని సందర్శించి, నివాళి అర్పించడానికి మోహన్ బాబు యూనివర్శిటీకి వచ్చారు.

Actor Mohan Babu lodged a complaint at the District Magistrate

సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. లోనికి పంపించడానికి నిరాకరించారు. గేటు తీయాలంటూ చాలాసేపు అక్కడే నిరీక్షించినప్పటికీ ఫలితం దక్కలేదు. అదే సమయంలో పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకోవడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సొచ్చింది.

తాను వస్తున్నానని తెలిసే కొంతమంది బౌన్సర్లను తీసుకొచ్చారని, తాను వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడేది లేదంటూ వ్యాఖ్యానించారు. పోలీసుల విజ్ఞప్తి చేయడం వల్లే వెనక్కి వెళ్తోన్నానంటూ అప్పట్లో చెప్పారు. చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లోనూ మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి ఫిర్యాదు చేశారు.

ఇప్పుడు తాజాగా మరోసారి మోహన్ బాబు కుటుంబం మరోసారి పోలీసులు, జిల్లా అధికారులను ఆశ్రయించాల్సి వచ్చింది. తనకు చెందిన ఆస్తులు, నివాసాల్లో ఉంటోన్న వారిని వెంటనే ఖాళీ చేయించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు.

జల్‌పల్లిలో తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారంటూ పరోక్షంగా మంచు మనోజ్‌ గురించి ప్రస్తావించారు. అక్కడి మంచు టౌన్‌షిప్‌లో అక్రమంగా నివసిస్తోన్నారంటూ ఫిర్యాదు చేశారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను తనకు దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వాళ్లను వెంటనే ఖాళీ చేయించాలని, ఆస్తులను తమకు అప్పగించాలని కోరారు.

ప్రస్తుతం జల్‌పల్లిలో మంచు మనోజ్ తన కుటుంబంతో కలిసి నివసిస్తోన్నారు. మోహన్ బాబు ఆస్తులపై పోలీసుల నుంచి నివేదికను తీసుకున్నారు జిల్లా కలెక్టర్. జల్‌పల్లి మంచు టౌన్‌షిప్‌లో నివసిస్తోన్న మంచు మనోజ్‌కు నోటీసులు మంజూరు చేసినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+