రేవంత్‌కు యాక్టర్ శివకృష్ణ పరామర్శ: డిఎస్ ఫొటో తొలగించిన విహెచ్
మహబూబ్‌నగర్/ హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డిని సినీనటుడు శివకృష్ణ పరామర్శించారు. అనంతరం పలువురు న్యాయవాదులు ఎమ్మెల్యేను కలిసి మాట్లాడారు. చర్లపల్లి జైలు నుంచి విడుదలైన తర్వాత జరిపిన ఊరేగింపుపై హైదరాబాద్‌లో పోలీసులు నమోదు చేసిన కేసుల గురించి న్యాయవాదులతో ఎమ్మెల్యే రేవంత్ చర్చించారు.
కాగా, కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీ భవన్‌లో మాజీ పార్టీ నేతల ఫొటోలను పార్టీ తెలంగాణ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు తొలగించారు. మరో నేత దామోదర్ రెడ్డితో కలిసి ఆయన వారి ఫొటోలను తీసేశారు. పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేసి, టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంపై విహెచ్ తీవ్రమైన ఆగ్రహంతోనే ఉన్నట్లు అర్థమవుతోంది.

డిఎస్ టిఆర్ఎస్ కోవర్టుగా పనిచేశాడని ఆయన ఆరోపించారు. గాంధీభవన్‌లో ఇప్పటికీ అలాగే ఉన్న కె. కేశవ రావు ఫొటోతో పాటు డి. శ్రీనివాస్ ఫోటోను విహెచ్, దామోదర్ రెడ్డి తొలగించారు. కేశవరావు కూడా గతంలో పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు.
కేశవరావు టిఆర్ఎస్‌లో చేరి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన మాజీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఫొటోను కూడా తొలగించారు. పిసిసి మాజీ అధ్యక్షులు పార్టీ నుంచి ఒక్కరొక్కరే తప్పుకుంటుండడం కాంగ్రెసు పార్టీ నాయకత్వాన్ని కలవరానికి గురి చేస్తోంది. డి. శ్రీనివాస్ పార్టీ మారడం తెలంగాణ కాంగ్రెసు పార్టీని కుదిపిసినట్లే.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications