మరోసారి, తెరపైకి 'హైదరాబాద్ దేశ రెండో రాజధాని': ఎందుకంటే..
హైదరాబాద్: హైదరాబాదును దేశానికి రెండో రాజధానిగా చేయాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాదును దేశానికి రెండో రాజధాని చేయాలనే వాదనలు వినిపించాయి. ఇప్పుడు తెలంగాణ టిడిపి సీనియర్ నేత మరోసారి ఆ విషయమై మాట్లాడారు.
టిడిపి నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సోమవారం నాడు మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాలకు చట్ట సభలలో సముచిత స్థానం కల్పించినప్పుడే నిజమైన స్వాతంత్రంయ అని అన్నారు. తెలంగాణ కల సాకారం అయినప్పటికీ వెనుకబడిన వర్గాలకు సరైన గుర్తింపు లేదన్నారు.
హైదరాబాదును దేశ రెండో రాజధానిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. నగరానికి రెండో రాజధాని హోదాను ఇస్తే అసమానతలు దూరం అవుతాయని వ్యాఖ్యానించారు. సత్వర అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని మోత్కుపల్లి అన్నారు.

టిడిపి తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ మాట్లాడుతూ... మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ తన అసమర్థ పాలన వల్ల లోటు బడ్జెట్‌లోకి తీసుకు వెళ్లారన్నారు. అవినీతిలో కూరుకుపోయిన మంత్రుల పైన సిఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు.
మంత్రివర్గంలో మహిళలు, వెనుకబడిన వర్గాలకు అవకాశం లేదన్నారు. తెలంగాణలో వివక్ష రూపుమాపాలంటే టిడిపి అధికారంలోకి రావాల్సిందే అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి స్వర్గీయ నందమూరి తారక రామారావు పాటుపడ్డారన్నారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
ఏపీ రాజధానిని మళ్లీ మార్చుకోవచ్చా ? అమరావతి గెజిట్ కూడా సరిపోదా ? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications