వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోశయ్య కుమారుడికి సోనియా ఫోన్ - మూడు రోజులు సంతాప దినాలు : అధికారిక లాంఛనాలతో..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. రోశయ్య మరణంతో తెలంగాణ ప్రభుత్వం మూడు రోజులు సంతాపదినాలుగా ప్రకటించింది. రోశయ్య అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంచనాలతో జరపాలని నిర్ణయించిన తెలంగాణ సర్కార్..ఈ మేరకు రంగారెడ్డి , హైదరాబాద్ జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నగర శివార్లలోని కొపంల్లిలో ఉణ్న రోశయ్య ఫాం హౌస్ రోశయ్య ఫాం హౌస్ లో అంత్యక్రియలు జరగనున్నాయి. మరణం పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఉపరాష్ట్రపతి సంతాపం

ఉపరాష్ట్రపతి సంతాపం

''ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య గారు పరమపదించారని తెలిసి విచారించాను. వారు నాకు చిరకాల మిత్రులు. విషయ పరిజ్ఞానంతో కూడిన వారి అనుభవం కీలక సమయాల్లో రాష్ట్రానికి దిశానిర్దేశం చేసిందని'' ఆయన ట్వీట్‌ చేశారు. ఓర్పు, నేర్పు కలిగిన మంచి వక్తగా రోశయ్య అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని'' ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రోశయ్య మృతిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. రోశయ్య కుమారుడితో ఫోన్లో మాట్లాడి సంతాపం వ్యక్తం చేశారు.

మూడు రోజుల సంతాప దినాలు

మూడు రోజుల సంతాప దినాలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి,కేవీపీ రామచంద్రారావు, షబ్బీర్‌ అలీ, మల్లు భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ తన సంతాప సందేశంలో రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సీఎం జగన్ సంతాప సందేశం

సీఎం జగన్ సంతాప సందేశం

''పెద్దలు రోశయ్య గారి మరణవార్త నన్నెంతగానో బాధించింది. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, శాసనసభ్యుడిగా... సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలు పదవులను అలంకరించిన రోశయ్య గారి మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని'' పేర్కొన్నారు. కొణిజేటి రోశయ్య పట్ల ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్బ్రాంతి సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య మరణం అత్యంత బాధాకరమన్నారు. దివంగత నేత వైస్ రాజశేఖరరెడ్డికి రోశయ్య అత్యంత సన్నిహితులన్నారు.

నివాళి అర్పించనున్న కేసీఆర్.. చంద్రబాబు


ఆయనకు భగవంతుడు ఆత్మశాంతి ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు.ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో రోశయ్య నివాసానికి చేరుకొని నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు నివాళి అర్పించేందుకు రానున్నారు. తెలంగాణ మంత్రులు హరీష్ రావు.. తలసాని శ్రీనివాస యాదవ్..శ్రీనివాస గౌడ్ తో సహా పలువురు రోశయ్య కు నివాళి అర్పించారు.

English summary
AICC President Sonia Gandhi had called on Rosaiahs son to condole.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X