హైదరాబాద్ శివారులో కలకలం: పిల్లల కోసం వెళ్లిన తండ్రిపై కాల్పులు, నటుడిపై కేసు
హైదరాబాద్: నగర శివారులో కాల్పులు ఘటన కలకలం రేపింది. శామీర్‌పేటలోని సెలబ్రిటీ క్లబ్‌లో సిద్ధార్థ్ దాస్ అనే వ్యక్తిపై సీరియల్ నటుడు మనోజ్ నాయుడు కాల్పులు జరిపాడు. ఎయిర్ గన్‌తో కాల్పులు జరిపాడు. పిల్లెట్స్ నుంచి తప్పించుకున్న సిద్ధార్థ్ దాస్ శామీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించి డీసీపీ సందీప్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరానికి చెందిన సిద్ధార్థ్ దాస్.. ఆయన భార్య స్మిత, కుటుంబ కలహాల కారణంగా 2019లో విడిపోయారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. స్మిత్ శామీర్‌పేటలోని విల్లా నెంబర్ 21లో మనోజ్ కుమార్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో శనివారం సిద్ధార్థ తన పిల్లలను చూసేందుకు విల్లా వద్దకు వచ్చాడు.

ఈ నేపథ్యంలో స్మితతో గొడవపడ్డాడు. దీంతో అక్కడేవున్న మనోజ్ కుమార్ ఆగ్రహానికి గురై తన వద్ద ఉన్న ఎయిర్ గన్‌తో సిద్ధార్థపై కాల్పులు జరిపాడు. అప్రమత్తమైన సిద్ధార్థ అక్కడ్నుంచి తప్పించుకుని శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాల్పులు జరిపిన మనోజ్.. పలు టీసీ సీరియళ్లలో నటిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా, మనోజ్ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సిద్ధార్థ పిల్లలు ఫిర్యాదు చేశారు. తనను కొట్టినట్లే.. తన చెల్లిని కూడా ఇష్టం వచ్చినట్లు మనోజ్ కొట్టాడని సిద్ధార్థ కుమారుడు చెప్పాడు. తాము తమ తల్లి వద్ద ఉండలేమని.. తమ తల్లి తరపు బంధువుల వద్ద కూడా ఉండలేమన్నారు.
శామీర్‌పేట్‌లో కాల్పుల కలకలం..అక్రమ సంబంధమే కారణం..!! pic.twitter.com/5uNcdHG2KL
— oneindiatelugu (@oneindiatelugu) July 15, 2023
చైల్డ్ వెల్ఫేర్ అధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని సిద్ధార్థ కుమారుడు సీడబ్ల్యూసీకి కోరాడు. తాము తమ తండ్రి వద్ద ఉంటామని చెప్పారు. కాగా, సిద్ధార్థతో విడిపోయిన తర్వాత నుంచి మనోజ్‌తో స్మిత సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. వీరితోనే సిద్ధార్థ పిల్లలు ఉంటున్నారు. మనోజ్ వారిని చిత్రహింసలకు గురిచేయడంతో పిల్లలు తమ తండ్రికి విషయం చెప్పిన క్రమంలో ఆయన వచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications