భక్తులకు అలర్ట్.. ఇకనుంచి యాదాద్రి కొండపై ఇవి నిషేదం..
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో ఒకటి యాదాద్రి గుట్టపై వెలసిన లక్ష్మి నరసింహస్వామి ఆలయం. ఇక్కడికి నిత్యం భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తుంటారు. అయితే, ఇక్కడికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు షాక్ ఇచ్చారు. ఇకనుంచి ఆలయంలో ఫొటోలు, వీడియోలు తీసుకోవడాన్ని నిషేదిస్తూ ఆలయ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆలయ ఈవో మంగళవారం వెల్లడించారు.
భక్తులు యాదాద్రి కొండపై వెలసిన లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవటంతో పాటు ఇక్కడి ఆలయ శిల్పకళను వారి కెమెరాల్లో బందిస్తున్నారు. అయితే, ఫొటోలు, వీడియోలు తీసుకోవటం ఆలయంలో రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఆలయంలో ఫొటోలు, వీడియోలు తీయడాన్ని నిషేదించారు.

అయితే, భక్తులు మాఢవీధుల్లో కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలు దిగితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అధికారులు తెలిపారు. వ్యక్తిగత కార్యక్రమాలకు ఆలయాన్ని ఉపయోగించుకోవడమనే ఆలయ ప్రతిష్ట దెబ్బతీసినట్లు అవుతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ అధికారులు వివరించారు.
మొబైల్ ఫోన్లు, కెమెరాలు అనుమతి లేదు..
ఇటీవలే యాదాద్రి ఆలయంలో హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన భార్య, కూతురితో కలిసి ఆలయ మాడవీధుల్లో ఫొటోలు, వీడియోలు తీసుకున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. దీంతో వాటిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.
ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉంటూ.. ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా ఫొటోషూట్లు చేశారంటూ ఆయనపై తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. అందుకే, ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వాస్తవానికి. ఆలయంలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు అస్సలు అనుమతి లేదు. స్వామివారి దర్శనం తర్వాత బయటికి వచ్చాక మాడవీధుల్లో మాత్రం ఫోటోలు తీసుకునే వెసులు బాటు ఉంది. అక్కడ ఫొటోగ్రాఫర్లే ఫ్యామిలీ ఫొటోలు తీస్తూ, అప్పటికప్పుడు ప్రింట్ చేసి ఇస్తుంటారు.












Click it and Unblock the Notifications