అల్ప్రాజోలం.. కొకైన్ కంటే డేంజర్: కఠిన చర్యులంటాయంటూ సందీప్ శాండిల్య వార్నింగ్
హైదరాబాద్: రాష్ట్రంలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన క్రమంలో రాష్ట్రంలో మత్తు పదార్థాలు అనే మాట వినపడకుండా గట్టి చర్యలు చేపడుతున్నారు. అంతేగాక, మాదక ద్రవ్యాలను సమూలంగా అంతమొందించేందుకు ఏర్పాటైన టీఎస్ న్యాబ్ పక్కా ప్రణాళితో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే భారీ మొత్తంలో మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంది.
ఇటీవల రూ. 3.14 కోట్లు విలువ చేసే 31.42 కిలోల అల్ప్రాఫాజోలంను నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో పట్టుకున్నారు. ఈ సమాచారం ఆధారంగా టీఎస్ న్యాబ్ పోలీసులు.. రెండు రోజుల కిందట సంగారెడ్డి జిన్నారంలో మూతపడిన ఓ పరిశ్రమలో 14 కిలోల నార్డజెపమ్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.

మరో కేసులో సూరారం పరిధిలో నరేందర్ అనే వ్యక్తి నుంచి 10 కిలోల అల్ప్రాఫాజోలం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరో కేసులో విధుల నుంచి తొలగించిన ఏఆర్ కానిస్టేబుల్ కూడా ఈ దందాలో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఢిల్లీ నుంచి పార్సిళ్లలో సైతం 34 కిలోలు పలువురి చేతులు మారినట్లు తేల్చామని పోలీసులు తెలిపారు.
ఇలా అల్ఫాజోలం విక్రయిస్తున్న నిందితుల్లో మాజీ పోలీసులు సహా కామారెడ్డికి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. హైదరాబాద్ లో అల్ఫాజోలంకు సంబంధించి ఇప్పటి వరకు 66 కేసులు నమోదైనట్లు టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. మాదకద్రవ్యాల్లోని కొకైన్ కంటే కూడా అల్ప్రాఫాజోలం ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో అల్ఫాజోలం తలనొప్పిగా మారిందని, దీన్ని విక్రయిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇటీవల కాలంలో మాదక ద్రవ్యాల్లో కొకైన్ కంటే అతి ప్రమాదకరమైన అల్ప్రాఫాజోలం వాడకాలపై దృష్టి సారించింది. అక్రమంగా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీఎస్‌న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య హెచ్చరించారు.












Click it and Unblock the Notifications