బండి సంజయ్‌కి అమిత్ షా ఫోన్: హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలపై ఆరా, జోష్
కరీంనగర్: తెలంగాణలో ఎంతో ఉత్కంఠగా సాగుతున్న హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఫోన్ చేసి ఫలితాలు ఎలా వస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అధిక్యంలో కొనసాగుతున్నట్లు, గెలుపు దిశగా సాగుతున్నట్లు బండి అమిత్ షాకు వివరించారు.
బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేయటం వల్లే హుజరాబాద్లో బీజేపీ గెలుస్తోందని చెప్పారు. ఈ క్రమంలో హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై అమిత్ షా అభినందనలు తెలిపారు.
Recommended Video

హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ హవా కొనసాగుతుండటంతో బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. నిజమైన సేవ చేసేవారికే ప్రజలు పట్టం కడుతారని అన్నారు. హుజురాబాద్‌లో కాషాయ జెండా ఎగురబోతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్డడం ఖాయమన్నారు.
హైదరాబాద్ నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్దకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. బండి సంజయ్‌ను భుజాలపై ఎత్తుకుని హర్షం వ్యక్తం చేశారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచారు. డబ్బు వాయిద్యాలు మధ్య నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంలోనే బండి సంజయ్‌కి అమిత్ షా ఫోన్ చేసి అభినందించారు.
ఇదిలావుంటే నియోజకవర్గ ప్రజలు కరీంనగర్ జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నారు. దీంతో జిల్లా కేంద్రం బీజేపీ కార్యకర్తలతో సందడిగా మారింది. రౌండ్ రౌండుకు బీజేపీకి ఆధిక్యం పెరుగుతుండడంతో ఈటల క్యాంప్ కార్యాలయానికి పార్టీ కార్యకర్తలు క్యూకడుతున్నారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేక పోవడంతో కరీంనగర్‌లోకి హుజురాబాద్‌కు చెందిన బీజేపీ కార్యకర్తలను అనుమతించడం లేదు. కరీంనగర్ శివారులోని మానకొండూరు కేఎస్ఆర్ గార్డెన్ వరకే అనుమతించారు. గార్డెన్‌కు వచ్చిన ఈటల కార్యకర్తలను కలుసుకున్నారు. ఉదయం మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు చేపట్టగా టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. అయితే తొలి లీడ్ నుంచి 20వ రౌండ్ వరకు ఈటల రాజేందర్ అధిక్యంలోనే కొనసాగుతున్నారు. దాదాపు ఈటల విజయం ఖరారైంది.












Click it and Unblock the Notifications